అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కు శాశ్వత అధికారం దఖలు పడాలనుకుంటున్నారు. ఎనభై ఏళ్లకు చేరువ అయిన రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా ఆయన తగ్గడం లేదు. మూడో సారి ఎందుకు పోటీ చేయకూడదని ఆయన అంటున్నారు. ఈ విషయంలో ఆయన రిపబ్లికన్లకను రెచ్చగొట్టేందుకు సిద్ధమయ్యారు. మూడో సారి పోటీ చేస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం పోటీ ఎన్ని సార్లు చేసినా అధ్యక్ష పదవిని మాత్రం రెండు సార్లు చేపట్టాలి. మూడో సారి చాన్స్ లేదు. రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయితే మూడో సారి పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. నాలుగేళ్ల తర్వాత తాను మూడో సారి కూడా పోటీ చేస్తానని అందుకు అవసరం అయితే రాజ్యాంగాన్ని మారుస్తామన్నట్లుగా ట్రంప్ మాట్లాడుతున్నారు. తాను మూడో సారి పోటీ చేయడానికి ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన ఉందన్నారు. ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి ప్రజాభిప్రాయం ఉందని తర్వాత చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
అమెరికా రాజ్యాంగం మార్చడం అంత సులువు కాదు. సెనెట్తో పాటు ప్రతినిధుల సభలోనూ బిల్లు మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. ఇప్పుడు రెండు సభల్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది కానీ మూడింట రెండు వంతుల మెజార్టీ లేదు. అదే సమయంలో మొత్తం యాభై రాష్ట్రాల్లో 75 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అది కూడా జరిగే అవకాశం లేదు. ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే రిపబ్లికన్లపై ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రంప్ కు పార్టీ ముఖ్యం కాదు.. తన పదవే ముఖ్యం. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అందుకే అమెరికాలో రాబోయే రోజుల్లో ట్రంప్ సృష్టించబోయే గందరగోళం ఊహించనంత ఉంటుందని స్పష్టమవుతోంది.