ట్రంప్ ఇంకా పగ్గాలు చేపట్టక ముందే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న వారిని ప్రత్యేక విమానాలు పెట్టి పంపేస్తున్నారు అధికారులు. ఇలాంటి వారితో అమెరికా నుంచి విమానాలు వారానికి ఒకటి, రెండు అయినా ఇండియాకు వస్తున్నాయి. ఒక్క ఇండియాకే కాదు అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులందర్నీ బలవంతంగా బయటకు పంపేస్తున్నారు. అలా ఇండియన్స్ కూడా అక్రమంగా వలస వచ్చిన వారిని పంపేస్తున్నారు.
వలస రావడం అంటే… వీసాలు తీసుకుని వెళ్లిన వారు కాదు. మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడినవారు. ఇలా ప్రవేశిస్తున్న భారతీయులు చాలా ఎక్కువ మందే ఉంటున్నారని రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ వెయ్యిమందికి పైగా భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి పంపినట్లు అమెరికా హోమ్‌ల్యాండ్ రికార్డులు చెబుతున్నాయి. గత నాలుగేళ్లలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిచేందుకు ప్రయత్నించిన లక్షా 70వేల మంది భారతీయులను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ అధ్యక్ష బాద్యతలు ముగిసిన తర్వాత వీసా విసాల విషయంలోనూ కఠినంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏ దేశ పౌరుడు ఉన్నా పంపేస్తారని అంటున్నారు. అదే సమయంలోఅమెరికాలోకి వచ్చే వారిని కూడా పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులను కూడా రాకుండా చేసి ఆన్ లైన్ లో చదువులు చెప్పుకోమంటారన్న భయంతో చాలా కాలేజీలు ముందుగానే తమ విద్యార్థుల్ని అమెరికా వచ్చేయాలని సందేశాలు పంపుతున్నాయి.