అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టగానే నేషనల్ ఎమర్జెన్సీ విధించి అయినా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని వెళ్లగొట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి సంఖ్య తక్కువ ఉండదని కనీసం కోటి మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇది అక్కడి ఇమ్మిగ్రెంట్స్లో భయానక వాతావరణం సృష్టిస్తోంది.
అమెరికాలోకి చట్టబద్దంగా వచ్చిన వారు.. సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడిన వారు.. అలాగే తాము ఉండటానికి అవసరమైన అన్ని పత్రాలు ఇన్ వ్యాలిడ్ అయిపోయినా ఇంకా అమెరికాలో ఉన్న వారు ఉంటారు. వారిపై తప్పటి వరకూ చూసి చూడనట్లుగానే ఉన్నారు. కానీ వీరంతా అమెరికాపై పడి తింటున్నారని.. నేరాలకు కారణం అవుతున్నారని ట్రంప్ ట్రంప్ ఆరోపణ. వీరందర్నీ బయటకు పంపించేస్తానని సరిహద్దుల్ని మరింత కట్టుదిట్టం చేస్తామని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అదే చేయబోతున్నారు.
అయితే దశాబ్దాలకుపైగా ఉంటున్న వారు కూడా ఉన్నారు. వారికి సరైన పత్రాలు ఉండవు. వారి విషయంలో కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ట్రంప్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చట్టాలు చేసేందుకు ఆయనకు పూర్తి స్థాయి అధికారం ఉంది. అందుకే పదవి చేపట్టగానే ప్రత్యేక విమానాల్లో అయినా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను వారి వారి దేశాలకు బలవంతంగా పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మంది భయపడి ఇప్పటికే వెళ్లిపోతున్నారు.