అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో గత ఎన్నికల్లో బైడెన్‌కు ఓటేసిన రాష్ట్రాల్లో కూడా ఈ సారి ట్రంప్‌కే మొగ్గు కనిపించంది. ఫ్లోరిడా,టెక్సాస్ రాష్ట్రాల్లో విజయం ట్రంప్ ను అధ్యక్ష పీఠానికి దగ్గర చేసిందని అనుకోవచ్చు. జనవరిలో ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
డెమోక్రాట్లు మొదట అభ్యర్థిని ఎంపిక చేసుకున్నప్పుడే మొదటి తప్పటడుగుపడింది. వయసు మీద పడిపోయి అనారోగ్యంతో ఉన్న జో బైడెన్ ను మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయన ట్రంప్ ముందు తేలిపోవడంతో చివరి క్షణంలో కమలా హ్యారిస్ ను ఫైనల్ చేశారు. ముందుగానే కమలాహ్యారిస్ ఖరారు చేసి ఉంటే మరింత ఫలితం వేరేలా ఉండేదన్న అంచనాలు ఉన్నాయి.
అమెరికాలో అధ్యక్షుడి పదవి కాలం నాలుగేళ్లు ఉంటుది. ఎవరైనా రెండు సార్లు మాత్రమే పదవి చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ట్రంప్‌కు మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అమెరికాకు గతంలో యువ అధ్యక్షులు వచ్చేవారు.కానీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్… కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ 80కి దగ్గర పడిన వారే. ఆనారోగ్య సమస్యలతో ఉన్నవారే.
ఇక ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడిగా పోటీ పడిన జేడీ వాన్స్ కు తెలుగు వారికి అల్లుడు. ఆయన భార్య ఉషా చిలుకూరి ఆంధ్ర మూలాలున్న మహిళ. మొత్తంగా అమెరికాలో మరో సారి ట్రంప్ హవా ప్రారంభమయింది.