బీజేపీకి విరాళాల వరదే !

2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1300 కోట్ల నిధిని సమకూర్చుకోగలిగింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల కన్నా ఇది ఏడు రెట్లు ఎక్కువ. 2022 23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.2120కోట్లు కాగా, అందులో 61 శాతం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక వెల్లడించింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1775 కోట్లు. 2021-22 నాటి ఆదాయం రూ.1917 కోట్లు కన్నా 2022-23లో మొత్తం ఆదాయం రూ.2366.8 కోట్ల వరకు అధిగమించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ఆ పార్టీకి 2021-22లో రూ.236 కోట్లు ఆదాయం రాగా, 2022-23 నాటికి రూ.171కోట్ల వరకు తగ్గింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొందిన సమాజ్‌వాది 2021-22లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్ల వరకు విరాళాల మొత్తం ఆదాయాన్ని పొందగలిగినప్పటికీ, 2022-23 నాటికి ఈ బాండ్ల నుంచి ఎలాంటి విరాళాలు పొందలేక పోయింది.

మరో రాష్ట్ర స్థాయి పార్టీ టీడీపీ 2022-23లో రూ.34 కోట్లు ఆర్జించగా, అంతకు ముందు సంవత్సరం కన్నా పది రెట్లు ఎక్కువగానే పొందగలిగింది. వడ్డీల రూపంలో బీజేపీ 2021-22లో రూ.135 కోట్లు పొందగా, 2022-23లో రూ.237 కోట్ల వరకు ఎక్కువగా సాధించగలిగింది. ఎన్నికలు, ప్రచారానికి సంబంధించి విమానాలు, ఎయిర్ క్రాఫ్ సర్వీస్‌ల కోసం 2021-22లో రూ.117.4 కోట్లు బీజేపీ చెల్లించగా, 2022-23లో ఆ సర్వీస్‌ల కోసం కేవలం రూ.78.2 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముందుకన్నా ఈ ఖర్చు బాగా తగ్గింది. బీజేపీ తన అభ్యర్థులకు 2021-22లో రూ.146.4 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించగా, 2022-23లో ఆ సాయం కేవలం రూ.76.5 కోట్లు మాత్రమే పరిమితమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close