మహేష్ సూపర్ హిట్స్‌లో `దూకుడు` ఒకటి. శ్రీనువైట్ల సృష్టించిన పాత్రలు, మహేష్ కామెడీ టైమింగ్, ముఖ్యంగా బ్రహ్మానందం, ఎం.ఎస్‌ల ఎపిసోడ్స్ – కలిసి ఓ ప్రభంజనం సృష్టించాయి. ఈ సినిమా విడుదలై.. ఈరోజుకి సరిగ్గా పదేళ్లు. అయితే దూకుడు మానియా ఈనాటికీ కనిపిస్తూనే ఉంది. దూకుడు విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా బెంగళూరులోనూ కొన్ని థియేటర్లలో `దూకుడు`ని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కాకినాడ, నెల్లూరు, అనంతపూర్, రాజమండ్రి, నంథ్యాల, భీమవరం, నరసింహపురం, ఖమ్మం, కడప, కొవ్వూరు, తిరుపతి, బెంగళూరు, పొద్దుటూరు, ఒంగోలు, కర్నూల్, శ్రీకాకుళంలో `దూకుడు` స్పెషల్ స్క్రీనింగ్ కానుంది, అన్నీ ఫస్ట్ షోలే. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీవీల్లో `దూకుడు` వందలసార్లు వచ్చేసింది. అయితే మహేష్ దూకుడిని థియేటర్లలో మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. దూకుడు స్టామినా అది.!