దూరదర్శన్… చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్ ను మార్చాలని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
దూరదర్శన్ లోగోను కుంకుమ రంగులోకి మార్చాలని నిర్ణయించడం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దేశంలోని అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుంటూ కాషాయికరణ చేస్తోన్న బీజేపీ… ఇప్పుడు అమితమైన జనాదరణ కల్గిన దూరదర్శన్ ను కూడా వదలడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికార పార్టీకి అనుకూలంగా దూరదర్శన్ వార్తలు, కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న తరుణంలో లోగో రంగు మార్చడం గమనార్హం.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దూరదర్శన్ మాజీ సీఈవో జవహర్ సర్కార్ తీవ్రంగా స్పందించారు. దూరదర్శన్ ప్రసార భారతి కాదు.. అది ప్రచార భారతి అంటూ సెటైరికల్ గా పేర్కొన్నారు.
మరోవైపు.. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చెప్తున్నా వందే భారత్ రైళ్ల కలర్ ను కూడా మార్చనుంది. వైట్ కలర్ లోనున్న రైళ్ల కలర్ ను కుంకుమరంగులోకి మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వేళ బీజేపీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.