పూరి కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ కెరీర్లో ఫుల్ మాస్ మిల్స్ లాంటి సినిమా కూడా అదే. ఇద్దరికీ మధ్య మంచి ట్యూనింగ్ కుదరడంతో ‘డబుల్ ఇస్మార్ట్’ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి. నిజానికి ‘డబుల్ ఇస్మార్ట్’ కి ఇలాంటి ఇబ్బందులేం లేవు. బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. ఎగ్రిమెంట్లు అవ్వడమే తరువాయి. పైగా.. పూరి ఇప్పుడు కూడా ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మణిశర్మతో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆయన ఇప్పటికే 3 పాటలు ఇచ్చారు. వాటి పిక్చరైజేషన్ కూడా అయిపోయింది. మరో రెండు పాటలు ఇవ్వాలి. అవి రెండూ సెట్ సాంగులే. కాబట్టి.. పాటలు ఇవ్వగానే హైదరాబాద్ లోనే షూటింగ్ పెట్టేస్తారు. రెండు పాటలు, ఓ ఫైట్, కొంత మేర టాకీ తప్ప ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది.
సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన షూటింగ్ పార్ట్ సైతం ఎప్పుడో పూర్తయిపోయింది. మరో 20 శాతం షూటింగ్ జరగాలంతే. ఫిబ్రవరిలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పూరిది జెట్ స్పీడు. ఆయన షూటింగ్ మొదలెడితే చక చక పూర్తి చేసేస్తాడు. అనుకొన్న తేదీకే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. ఇది కావాలని తీసుకొన్న బ్రేకే తప్ప… వచ్చిన బ్రేక్ మాత్రం కాదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన అప్ డేట్ ఒకటి బయటకు రానుందని టాక్.