ఆగడు, బ్రూస్లీ ఫ్లాపుల తరవాత శ్రీనువైట్ల కెరీర్ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలెవరూ సిద్ధం కాలేదు. ఆయన ఎంత తిరిగినా చెప్పులు అరిగిపోయాయే తప్ప.. హీరోలు కనికరించలేదు. చివరికి వరుణ్ తేజ్ తో మిస్టర్ ను తెరకెక్కించాడు. వరుసగా రెండు ఫ్లాపులతో ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డాడు వైట్ల. ఆయినకు ఖచ్చితంగా ఓ హిట్ కావాలి. అది మిస్టర్ తో వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.
అయితే ఈ సినిమా వైట్ల ఆశలను నిండా ముంచేసింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చినా మిస్టర్ ఫ్లాఫ్ టాక్ ను మూటకట్టుకుంది. రెండో రోజే రిజల్ట్ చెప్పడం సరికాదు గానీ వాస్తవం మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అని తేల్చేశారు సినిమా చూసిన జనాలు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా మిస్టర్ వైట్లను మరోసారి నిరాశ పరిచిందని చెప్పకతప్పడం లేదు.
కాగ, ఈ సినిమా రిజల్ట్ వైట్లపై రెండు రకాలుగా ప్రభావం చూపించింది. ఈ సినిమాకి డబ్బులు పెట్టాడట వైట్ల. ఆగడు, బ్రూస్లీ ఫ్లాపుల తర్వాత వైట్లతో సినిమా చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో వైట్లనే ఒక నిర్మాతగా మారో టాగూర్ మధుతో కలసి మిస్టర్ సెట్ చేశాడు. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా ఫ్లాఫ్ అయితే వైట్లకు ఒక్కపైసా కూడా రేమ్యునిరేషన్ కానీ, పెట్టిన డబ్బుకాని తిరిగిఇవ్వడం జరగదని అగ్రీమెంట్ చేసుకున్నారట. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాపుల లిస్టు లో చేరిపోవడం ఖాయమైయింది. ఈ రకంగా వైట్లకు డబల్ లాస్ అన్నమాట.