స్టార్ హీరోల పుట్టిన రోజంటే సమ్ థింగ్ స్పెషల్ అనుకోవాలి. అందులోనూ మెగా స్టార్ పుట్టిన రోజు అంటే.. మెగా సెలబ్రేషన్స్ మామూలే. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. కాబట్టి.. ఫ్యాన్స్ చిరు నుంచి ప్రత్యేకంగా ఏదైనా కోరుకుంటారు. ఈ విషయం చిరుకీ తెలుసు. ప్రస్తుతం చిరు `సైరా నరసింహారెడ్డి`తో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆ సినిమా నుంచి లుక్కో, టీజరో రావడం ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. చిత్రబృందం కూడా మెగా అభిమానుల ఆశల్ని వమ్ము చేయకూడదనే చూస్తోంది. ఆ రోజున టీజర్ విడుదల చేయాలా, లేదంటే లుక్కుతో సరిపెట్టాలా? అనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే ఈలోగా రామ్ చరణ్ సినిమా నుంచి మరో వార్త అందుతోంది. రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22న మెగా అభిమానులకు ట్రీట్‌గా ఫస్ట్ లుక్ విడుదల చేద్దామని ప్లానింగ్‌లో ఉంది చిత్రబృందం. ఒకే రోజు రెండు లుక్కులూ ఎందుకులే… అనుకుంటే మాత్రం చరణ్ కాస్త వెనుకంజ వేసే ఛాన్సుంది. లేదంటే మాత్రం.. అటు చిరు, ఇటు చరణ్ లుక్కులు రెండూ.. ఆగస్టు 22నే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.