ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి హాలీడే ట్రిప్‌కు వెళ్తున్నారని మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. అది కూడా వ్యూహాత్మకంగా కొంత మంది మందికి ఆయన లండన్, పారిస్ వెళ్తున్నారని.. మరికొంత మందికి దేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్తారని సమాచారం ఇచ్చారు. అధికారికంగా ఆయన ఎక్కడకు వెళ్తున్నారో మాత్రం క్లారిటీ లేదు. లండన్, పారిస్‌లలో సీఎం జగన్ కుమార్తెలు చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్లో సీఎం జగన్ పెద్దకుమార్తె హర్షా రెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతున్నారు. గత ఏడాది విమానం ఎక్కించడానికి సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగుళూరు కూడా వెళ్లారు.
ఎప్పుడైనా విహారయాత్రలకు వెళ్లినా సీఎం జగన్ ఎక్కువగా లండన్, పారిస్ వెళ్తారు. గతంలో బంగీ జంప్ చే్సిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆయన కొన్ని సార్లు దేశంలోని పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్లారు.గతంలో ఓ సారి కోల్‌కతా పాటు పలు చోట్ల పర్యటించి వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగాసీఎం జగన్ హాలీడే ట్రిప్‌కు ఎందుకు వెళ్తున్నారన్న అంశంపై స్పష్టత లేదు. కానీ సీఎం జగన్ వివాహ వార్షికోత్సవం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉందంటున్నారు.
జగన్ – భారతిల వివాహ బంధానికి పాతికేళ్లు అవుతున్నాయని ఆ ముఖ్యమైన క్షణాల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబం అంతా కలిసి టూర్‌కు వెళ్తున్నారని అంటున్నారు. అయితే సీఎం జగన్ దేశం దాటి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం హోదాలో వచ్చే డిప్లమాటిక్ పాస్‌పోర్టు ఉన్నప్పటికీ.. గతంలో జెరూసలెం, అమెరికా వెళ్లినప్పుడు పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి పర్మిషన్ ఏదీ ఇంకా తీసుకోనందున ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం తక్కువేనంటున్నారు