శ్రీ రెడ్డి, తన స్నేహితురాలు తమన్నా మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ లీకవడం తెలిసిందే. అయితే ఈ ఆడియో లీకైప్పటికీ కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలి పోయాయి.
- మొదటిది సురేష్ బాబు తో డబ్బులు ఇప్పిస్తానని రాంగోపాల్ వర్మ ఆఫర్ చేస్తే శ్రీ రెడ్డి దానిని తిరస్కరించింది, ఐదు కోట్ల ఆఫర్ తిరస్కరించడం గొప్ప విషయం అని వర్మ చెబుతున్నాడు, సరే మరి దగ్గుబాటి అభిరాం పేరు ఆ తర్వాత మరెప్పుడూ ఎందుకు ప్రస్తావించలేదు, అసలు ఆయనపై ఎందుకు పోరాటం చేయడం లేదు.
- రెండవది వైయస్సార్ పార్టీ వాళ్లు స్కెచ్ వేశారు అని ప్రస్తావించింది. అసలు ఏమిటి ఆ స్కెచ్ ? ఆ పార్టీ తరఫున అసలు వీళ్లను ఎవరు సంప్రదించారు ?
- ఎవరు అవునన్నా, కాదన్నా, మన రాష్ట్రంలో మీడియా ఆయా పార్టీలకు వంతపాడడం తెలిసిందే. ఒకవేళ ఇది వైయస్సార్ కాంగ్రెస్ స్కెచ్ అయితే, దానికి టీవీ నైన్ ఇంతగా మద్దతిస్తుందా?
శ్రీ రెడ్డి మాట్లాడుతూ, మనకు టిడిపి సపోర్ట్ అస్సలు లేదని స్పష్టంగా నొక్కి వక్కాణించి చెప్పింది. అలాగే వైయస్సార్ కాంగ్రెసు స్కెచ్ అని గట్టిగా చెప్పింది.అలా చెప్పాల్సిన అవసరమేంటి? ఉద్దేశపూర్వకంగా ఈ ఆడియో లీక్ చేసి సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? . ఇది వీరిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. ఇది ఎలా లీకైంది? వీరిద్దరి లోనే ఒకరు చేసుండాలి. ఎవరు ?ఎందుకు? - ఆడియో చివరలో- “అసలు పవన్ కళ్యాణ్ ఎలా బతుకుతారో చూస్తా, ఎలా గెలుస్తారో చూస్తా, అతని ఓటమి కోసం నా చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడుతా అంటూ శ్రీరెడ్డి మాట్లాడింది. అసలు పవన్ కళ్యాణ్ పై న శ్రీ రెడ్డి కి ఎందుకు అంత ద్వేషం? తనను అన్యాయం చేసిన దగ్గుబాటి అభిరాం లాంటి వాళ్ల కంటే ఎక్కువగా పవన్ ని ఎందుకు ఎందుకు దూషించటం ? వర్మ లాంటి వాళ్ళు పబ్లిసిటీ కోసమే పవన్ ని తిట్టమని తనకి సలహా ఇచ్చానని చెబుతుంటే, శ్రీ రెడ్డి వ్యక్తిగత సంభాషణల్లో కూడా పవన్ ని దూషించడం ఎందుకు.
ఒకవేళ విషయాన్నిసైడ్ ట్రాక్ పట్టించి వేరేవాళ్లను బలిపశువులు చేయడానికే ఈ ఆడియోను లీక్ చేసి ఉంటే మాత్రం, అంతకంటే దారుణం మరొకటి ఉండదు.