ఆంధ్రజ్యోతి పత్రిక… ఏపీ ప్రభుత్వ నిజాయితీని మరోసారి గట్టిగా ప్రశ్నించింది. ఇరవై లక్షల మంది యువత .. ఎన్నో ఆశలు పెట్టుకుని రాసిన .. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకయిందని… బ్యానర్ ఐటమ్‌గా… భారీ సాక్ష్యాలతో ప్రచురించింది. అలజడి రేపే కథనం ఇది. పది రోజుల్లోనే పరీక్ష ఫలితాలు ప్రకటించామని.. జగన్మోహన్ రెడ్డి .. ఉద్యోగుల్ని అభినందించారు. అయితే.. అర్హులకే.. ఉద్యోగాలు అందుతున్నాయా.. లేదా అనే పర్యవేక్షణను మాత్రం ఆయన చేయలేకపోయారు. ఆంధ్రజ్యోతి పత్రిక కథనంలో.. తీసి పారేయాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు. సచివాలయ ఉద్యోగ పరీక్షల పేపర్ సెట్టింగ్ చేసిన ఏపీపీఎస్సీలో ఉద్యోగులే.. పరీక్ష రాశారు. వాళ్లే టాప్ ర్యాంకర్లు అయ్యారు. అంటే.. పేపర్ అక్కడే లీక్ అయిందని అర్థం.
అంతే కాదు.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ రిటైర్డ్ అధికారి చేతికి… పరీక్ష పేపర్ ముందుగానే వెళ్లిందని.. అక్కడ్నుంచి అస్మదీయులందరికీ… చేరిపోయిందని… ఆంధ్రజ్యోతి కథనంలో సారాంశం. జనరల్ విభాగంలో టాపర్లను .. పరిశీలిస్తే… దాదాపుగా అందరూ ఒకే సామాజికవర్గం వారున్నారు. ఇది కూడా అనుమానాలను తావిచ్చేదిలా ఉందని.. ఆంధ్రజ్యోతి కథనానికి బలం చేకూరుస్తుందన్న అభిప్రాయం.. పరీక్ష రాసిన వారిలో ఏర్పడుతోంది. కొన్ని రోజుల క్రితం… చిత్తూరు జిల్లాలో ఓ మంత్రి పేరు చెప్పుకుని రూ. ఐదు లక్షలకు పేపర్ అమ్ముకున్నారన్న ప్రచారమూ జరిగింది. ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.
గతంలో తెలంగాణలో… ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయట పెట్టింది.. ఆంధ్రజ్యోతినే. ఓ చిన్న ఆధారాన్ని పట్టుకుని… రోజుల తరబడి కథనాలు ప్రచురించడంతోనే… ఆ స్కామ్ బయటకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరిగిందని ఆరోపణలు ఉన్నప్పటికీ… ఆంధ్రజ్యోతి కథనాలతో విచారణ జరగక తప్పలేదు. ఆ కేసు ఇప్పటికి ఏమయిందో తెలియలేదు కానీ.. మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు.. సచివాలయ ఉద్యోగ పరీక్షల విషయంలో.. ఏపీ సర్కార్ ఏం చేయబోతోందో మరి.. !