వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి… మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విగతజీవిగా పడి ఉండగా.. మొదట చూసిన ఆయన పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో.. ఆయన బాత్లో పడి ఉన్నారని.. చెప్పారు. కానీ.. బెడ్రూంలో.. మాత్రం.. రక్తపు మడుగు ఉందన్నారు. ఒక వేళ.. బాత్రూంలో పడి ఉంటే… రక్తం బెడ్రూంలోకి వచ్చే అవకాశం లేదు. రక్తం ధారగా కారిపోయి.. బెడ్రూంలోకి రావడానికి అవకాశం లేదు. ఏ ఇంటికైనా… పల్లం .. బాత్రూంవైపే ఉంటుంది. ఎగువ వైపు.. రక్తం … ధారగా వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే వివేకానందరెడ్డి.. తలకి, చేతికి గట్టి దెబ్బలు తగిలాయి.
గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతే… తగిలే దెబ్బలు వేరుగా ఉంటాయని.. ఎవరో కొట్టినట్లుగా అ దెబ్బలు ఉండవంటున్నారు. కింద పడితే.. ఒక వైపు మాత్రమే దెబ్బలు తగులుతాయి. కానీ.. తాను వచ్చి చూసే సరికి.. ఆయన తల వెనుక ముందు కూడా గాయాలున్నాయని.. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా మృతిపై ఆయన పీఏ ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు విచారణ ప్రారంభించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. మరో వైపు ఆయన పోస్ట్మార్టం తర్వాత అసలు ఎలా చనిపోయారన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వైఎస్ కుటుంబీకులు అందరూ మెల్లగా… పులివెందుల చేరుకుంటున్నారు. ఆ ఇంట్లో.. ఆయన ఒక్కరే ఉంటున్నారు. భార్య, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. వీరందరూ హుటాహటిన పులివెందుల చేరుకుంటున్నారు. వారు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం భిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.