హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు… కుటుంబంపై.. గృహ హింస కేసు నమోదయింది. జస్టిస్ నూతి రామ్మోహన్రావు కోడలు సింధూశర్మను… కుటుంబసభ్యులు తీవ్రంగా హింహిస్తున్నారని…ఆమె స్నేహితులు… గత మూడు, నాలుగు రోజులుగా.. సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం… వివాదాస్పదం అవుతూండగానే.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింధూశర్మ.. నేరుగా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుకు చేశారు. తనను మామ నూతి రామ్మోహన్ రావుతో పాటు… తన భర్త వశిష్ట, అత్త దుర్గ జయలక్ష్మితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేశారని సింధు శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయమూర్తిగా అత్యున్నత స్థానంలో పని చేసిన తన మామతో పాటు … భర్త,అత్తపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. కేసు రిజిస్టర్ చేసిన సీసీఎస్ పోలీసులు ఐపీసీ 498-A, 406,323 సెక్షన్లతో పాటు డీపీ 4 , 6 చట్టం కింద జడ్జి నూతి రామ్మోహన్ రావు, వశిష్ఠ,దుర్గ జయలక్ష్మి పై కేసులు నమోదు చేశారు. వశిష్ట, సింధూశర్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరి పాలు తాగే పసివాడు. అయినా దంపతుల మధ్య కొంత కాలంగా సఖ్యత లేదని… చెబుతున్నారు. గతంలోనూ.. ఓ సారి ఇలాంటి జరిగితే… సింధూశర్మ తల్లిదండ్రులు… సర్ది చెప్పి పంపించారు.
పెళ్లి సమయంలో భారీగానే లాంఛనాలు ఇచ్చినప్పటికీ.. అదనపు కట్నం కోసమే…తన కుమార్తెను హింహిస్తున్నారని.. సింధూశర్మ తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నత స్థానంలో పని చేసిన న్యాయమూర్తిపై… వరకట్న వేధింపుల కేసు నమోదవడం… ఇటీవలి కాలంలో చోటు చేసుకోలేదు. అందుకే.. న్యాయవర్గాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది.