రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్.. తజన్గ సర్కార్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అమరావతికే తమ మద్దతంటున్నారు. అభివృద్ది లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని అంటున్నారు. అంతా చేస్తూ.. జగన్‌కు అండగా ఉంటూ.. ఇప్పుడు ఏపీకి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ వస్తున్న విమర్శలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. సీఎం జగన్‌కు బీజేపీ అండగా ఉందని జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని అందులో వాస్తవం లేదని ఆయన చెబుతున్నారు.
అయితే ఇలా ప్రచారం జరగడానికి కారణం బీజేపీ చేతలే. జగన్‌కు నొప్పి తగిలితే కొంత మంది బీజేపీ నేతలు కవర్ చేసుకుంటూ పరుగెత్తుకుంటూ వస్తారు. ఇప్పటికీ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సరే రాష్ట్ర బీజేపీలో వారు వైసీపీ సానుభూతిపరులు అనుకున్నా.. కేంద్రం నుంచి వైసీపీకి అందుతున్న సహకారం మాత్రం ఇంకా ఎక్కువ. జగన్ ఎన్ని అప్పులు చేయాలనుకున్నా.. రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేయాలనుకున్నా.. కేంద్రం సపోర్టు ఫుల్‌గా ఉంటోంది. రాష్ట్రంలో ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నా.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నా కేంద్రం ఏ మాత్రం అడ్డుకోకపోవవడమే దీనికి నిదర్శనం. చివరికి రాజధాని బిల్లులు చెల్లవని తెలిసి కూడా గవర్నర్ సంతకం పెట్టారంటే బీజేపీ సహకారం లేదని ఎవరైనా అనుకుంటారా ?
అయితే లక్ష్మణ్ మాత్రం బీజేపీ.. జగన్‌కు ఏ మాత్రం అండగా లేదని చెబుతున్నారు. ఇప్పుుడు పరిస్థితులు మారిపోయాయని ఆయన చెప్పదల్చుకున్నారేమో కానీ.. కమాటల్లో చెబితే మాత్రం ఎవరూ నమ్మలేరు. చేతల్లో చూపించాల్సిందే. విచ్చలవిడిగా చేస్తున్న అప్పులకు పర్మిషన్లు ఇవ్వకుండా.. రాష్ట్రాన్ని కాపాడగలగాలి. మాటల్లో చెబుతున్న అమరావతి మద్దతును చేతల్లో చూపాలి. లేకపోతే ఎప్పట్లా రాజకీయం చేస్తే ప్రజలు ..బీజేపీని వైసీపీ అనుబంధంగానే చూస్తారు. ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు.