మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తదితరులు ఈరోజు అనంతపురంలో బండ్లపల్లి గ్రామంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి డిల్లీ నుండి వస్తున్నారు. వారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని, అక్కడి నుంచి హెలికాఫ్టర్లలో బండ్లపల్లి గ్రామం చేరుకొంటారు.
యూపీఏ హయంలో పదేళ్ళ క్రితం ప్రధానమంత్రి గ్రామీణ్ రోజ్ గార్ యోజన (గ్రామీణ ఉపాధి హామీ పధకం) బండ్లపల్లి గ్రామం నుంచే మొదలుపెట్టారు. దాని వలన యూపీఏ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దాని పేరు మార్చి ఆ పధకాన్ని నేటికీ కొనసాగిస్తోంది. ఆ పధకం పెట్టి పదేళ్ళు పూర్తయినందున కాంగ్రెస్ నేతలు అందరూ అది మొదలుపెట్టిన బండ్లపల్లి గ్రామంలో అట్టహాసంగా కార్యక్రమాలు, బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. వాటికి హాజరు కావడానికే కాంగ్రెస్ ప్రముఖులు ఈరోజు అనంతపురానికి తరలివస్తున్నారు. రాష్ట్రం నుండి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, సి.రామచంద్రయ్య, చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుఅవుతారు.