తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద రూ. 1800 కోట్ల వ్యయంతో డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు చేయబోతోంది. మొదట ఈ ప్రాజెక్టును ముంబై సముద్ర తీరంలో ఏర్పాటు చేయాలని కేంద్రం భావించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్ధన మేరకు సాగరమాల పధకంలో భాగంగా దీనిని రాష్ట్రంలో అంతర్వేది వద్ద ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ డ్రెడ్జింగ్ హార్బర్ లో డ్రెడ్జింగ్ ప్రధాన కార్యాలయం, శిక్షణా కేంద్రం, మౌలిక వసతుల కల్పనా కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. బంగాళా ఖాతం, అరేబియా సముద్రాలలో డ్రెడ్జింగ్ కార్యకలాపాలన్నీ ఈ అంతర్వేది కేంద్రం నుండే నిర్వహించబడుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తొలి విడతగా రూ.500కోట్లు మంజూరు చేస్తుంది. డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, నిపుణుల బృందం ఈనెల 3వ తేదీన అంతర్వేదిలో ప్రాజెక్టు ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని పరిశీలించేందుకు వస్తున్నారు.