కాంగ్రెస్ , బీఆర్ఎస్ యువనేతలు డ్రగ్స్ చాలెంజ్‌లు విసురుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలందరికీ డ్రగ్స్ టెస్టులు చేయించాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బలమూరి వెంకట్ డిమాండ్ చేశారు. దాంతో తాము ఎంపీ అనిల్ యాదవ్ ఇంటికి యూరిన్ శాంపిళ్లు పంపుతామని టెస్టులు చేయించుకోమని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. టెస్టులు ఎలా చేయించుకోవాలో తెలియదా.. దమ్ముంటే అందరం కలిసే టెస్టులకు శాంపిల్స్ ఇద్దాం రావాలని … అనిల్ కుమార్, బలమూరి వెంకట్ సవాల్ చేశారు.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వద్దకు వెళ్లి రెండు గంటల పాటు ఎదురు చూశారు. సోషల్ మీడియాలో లైవ్ పెట్టారు. ఎవరూ రాలేదు. వీరిపై ఉదయమే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. దొంగతనంగా ఆస్పత్రి వద్దకు వెళ్లి సవాళ్లు విసురుతున్నారని ఆరోపించారు. తన కారులో డ్రగ్స్ పెట్టేందుకు బీఆర్ఎస్ యువనేతల్ని డ్రగ్స్ కేసుల్లో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
తనకు పోలీసులే ఇలా చెప్పారని కౌశిక్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి అంతా తెలుసని.. బయటపెడతానని కౌశిక్ రెడ్డి బెదిరిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి పోలీసుల సాయంతోనే తమ కార్లలో డ్రగ్స్ పెట్టాలనుకుంటున్నారని అంటున్నారు. వీరికి కాంగ్రెస్ యువనేతలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో కానీ.. డ్రగ్స్ వ్యవహారం మాత్రం లైవ్‌లో ఉంటోంది.