త్రివిక్రమ్ – దేవిశ్రీ ప్రసాద్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది… ఇలా వరుసగా మ్యూజికల్ హిట్స్ అందించారు. అయితే కొన్ని సినిమాలుగా దేవిని దూరం పెట్టాడు త్రివిక్రమ్. అ.ఆ కోసం మిక్కీ జె.మేయర్‌ని రంగంలోకి దింపాడు. అజ్ఞాతవాసి కోసం అనిరుథ్ని వాడుకున్నాడు. ఈ సినిమాల్లో పాటలు బాగానే ఉన్నా.. దేవి తాలుకూ `మ్యాజిక్` మిస్సయ్యింది. `అజ్ఞాతవాసి`లో ఆ లోటు మరింత ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు మళ్లీ… దేవిశ్రీ ప్రసాద్‌ని రంగంలోకి దించుతున్నాడు త్రివిక్రమ్.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల సినిమాలకి దేవి సంగీతం అందించబోతున్నాడు. నిజానికి ఈ సినిమా కూడా అనిరుథ్ చేతిలో పెట్టాలని త్రివిక్రమ్ భావించాడు. సాంకేతిక నిపుణల జాబితాలో తొలిగా ఫిక్సయ్యింది అనిరుథ్ పేరే. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. `అజ్ఞాతవాసి` ఫ్లాప్ తో వేళ్లన్నీ.. త్రివిక్రమ్‌ని చూపించడం మొదలెట్టాయి. ఎన్టీఆర్ సినిమాపై ఒత్తిడి పెంచేశాయి. ఈ పరిస్థితుల్లో దేన్నీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. తన బలం మరింత పెంచుకొంటూ వెళ్లాల్సిందే. అందుకే.. త్రివిక్రమ్ మరోసారి దేవిశ్రీతో జట్టుకట్టడానికి ఫిక్సయ్యాడు. మరి దేవి రాక… త్రివిక్రమ్‌ని మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.