గౌతమి పుత్ర శాతకర్ణి యూనిట్‌కీ, బాలయ్య అభిమానులకు షాకిచ్చే విషయం. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకొన్నాడు. ఇప్పుడు మరో సంగీత దర్శకుడి కోసం చిత్రబృందం అన్వేషణ ప్రారంభించింది. బాలయ్య సినిమా లెజెండ్కి సంగీతం అందించాడు దేవిశ్రీ . ఆ సినిమా మ్యూజికల్‌గానూ బాగా ఆడింది. దాంతోగౌతమి పుత్ర సినిమాకి బాలయ్య రికమెండేషన్ తోనే టీమ్‌లోకి వచ్చాడు దేవిశ్రీ. అయితే.. సడన్ గా ఈ టీమ్‌లోంచి తప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు దేవి. సంక్రాంతి కానుకగా ఈసినిమాని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. ఆల్రెడీ విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే దేవి తనకు ఇంకాస్త సమయం కావాలన్నాడట. ట్యూన్లు కట్టడానికి, ఆర్.ఆర్ ఇవ్వడానికి చాలా సమయం తీసుకొంటాడు దేవి. పైగా ఇప్పుడు దేవి చేతిలో చాలా సినిమాలున్నాయి. దాంతో గౌతమికి డేట్లు కేటాయించలేకపోతున్నాడట. ఈ విషయం బాలయ్యకు చెప్పి, ఆయన అంగీకారంతోనే ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ వెళ్లిపోవడంతో.. ఇప్పుడు మరో సంగీత దర్శకుడ్ని వెదకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీరవాణి గానీ, ఇళయరాజాగానీ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరో వారం పది రోజుల్లో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.