చిరంజీవి 150వ సినిమా ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి సంబంధించిన పనులన్నీ నిదానంగా సాగుతున్నాయి. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని దేవిశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. శుక్రవారం చిరంజీవితో కలసి కథా చర్చల్లో పాల్గొన్నాడు దేవి. వెల్కమ్ బ్యాక్ సార్.. వుయ్ లవ్ యు.. అంటూ చిరుని ఆహ్వానించాడు దేవి.
శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు సంగీతం అందించాడు దేవి. శంకర్ దాదా ఎంబీబీఎస్ మ్యూజికల్ హిట్టయ్యింది. దాని సీక్వెల్ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడినా పాటలకు మాత్రం మంచి ఆదరణ లభించింది. కత్తి హ్యాట్రిక్ కాంబినేషన్. పాటల విషయంలో దేవి.. ఎలాంటి నిరుత్సాహానికీ గురిచేయడన్న ధీమా చిరులో కనిపిస్తోంది. అందుకే బిజీ షెడ్యూల్‌తో సతమతమవుతున్నా… దేవి ఈ సినిమాకి పనిచేయాల్సిందే అని పట్టుబట్టి మరీ ఒప్పించుకొన్నాడు చిరు. మరి ఎలాంటి పాటలొస్తాయో చూడాలి.