నాయకత్వ స్థానంలో ఉన్న వారికి తప్పుడు ఆలోచనలు ఉంటే.. ఆ నష్టం ఎన్ని వ్యవస్థలు భరించాలో ఇప్పుడిప్పుడే ఏపీ పరిణామాలు నిరూపిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను క్రిమినల్ మైండ్ సెట్‌తో కుళ్లిపోయేలా చేసిన జగన్ ఇప్పుడా వ్యవస్థలో ఉన్న వారిలో సగం మందిని బాధితులుగా మార్చేశారు. తాజాగా కొత్త ప్రభుత్వం చేపట్టిన డీఎస్పీల బదిలీల్లో చోటు చేసుకున్న పరిణమాలే సాక్ష్యం.
ఏపీ ప్రభుత్వం 50 మందికిపైగా డీఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వలేదు. వారందర్నీ డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయమని ఆదేశించింది. వీరంతా ఎవరంటే.. జగన్ రెడ్డి చెప్పినట్లుగా చేసిన వారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని తూ.చ తప్పకుండా అమలు చేయడానికి వెనుకాడని వారు. వీరి వ్యవహారశైలితో టీడీపీ నేతలు, క్యాడర్ వారిపై కసి పెంచుకున్నారు. తమ పాలనలో వారికి పోస్టింగ్ ఉండకూడదని పట్టుబట్టారు. తమపై నమోదైన మూడు వేల కేసులకు కారణం ఎవరెవరో గుర్తు పెట్టుకుని లెక్క తేల్చేందుకు సిద్ధమయ్యారు.
Also Read : నాడు జగన్ విలాసం – నేడు వైసీపీ నేతల విలాపం
వీరిలో అత్యధికులు ఒక వర్గానికి చెందిన వారే. పోలీసు ఉద్యోగం ఎలా సంపాదించామో పట్టించుకోకుండా.. జగన్ రెడ్డి కోసం పని చేసి.. వీరంతా సర్వీసు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఎన్నికల సమయంలో కూడా బరి తెగించిన వారికి ఇప్పుడు పోస్టింగులు దక్కలేదు. చంద్రబాబు పధ్నాలుగేళ్లు సీఎంగా చేశారు.. ఇతరులు సీఎంలు అయ్యారు కానీ.. ఇలా ఎప్పుడూ వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదు. వారి బాధితులు కూడా ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఒక్క డీఎస్పీల్లోనే యాభై మందికిపైగా ఉన్నారు.
వీరిలో చాలా మంది శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. తాడిపత్రిలో పని చేసిన చైతన్య లాంటి డీఎస్పీలపై కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.