బాలయ్య – బోయపాటి సినిమా వెనక్కు వెళ్లినా, దానిపై ఫీలర్లు మాత్రం ఆగలేదు. ఆ సినిమా ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తారని ధీమాగా వినిపిస్తోంది. అంతే కాదు, ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్ ల్లో కనిపిస్తారని, ఓ గెటప్ కు కాస్త గుబురు గెడ్డం వుంటుందని టాక్.
బాలయ్య ప్రస్తుతం ఎన్నికలు, రాజకీయాల్లో పడి శరీరాకృతి పట్టించుకోలేదని, చాలా లావుగా వున్నారని, అందువల్ల కాస్త తగ్గిన తరువాతే ఈ సినిమా ప్రారంభిస్తారని కూడా వినిపిస్తోంది. అదే విధంగా గెడ్డం కూడా విగ్ వాడకుండా, నాచురల్ గా పెంచాలని బోయపాటి కోరారని టాక్.
ఇవన్నీ కలిసి చెబుతున్నది ఏమిటంటే, బోయపాటి-బాలయ్య సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కసరత్తు చాలానే వుందని. అందుకే కాస్త జాగ్రత్తగా టైమ్ తీసుకుని, అప్పుడు సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.