2017 సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ తన వందో సినిమా విడుదల చేయాల్సిందే.. అని పట్టుపట్టుకొని కూర్చున్నాడు నందమూరి బాలకృష్ణ. అందుకే గౌతమి పుత్ర పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. క్రిష్పెళ్లి సందర్భంగా షూటింగ్‌కి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ని మరోలా వాడుకొంటోంది చిత్రబృందం. ఇప్పటి వరకూ తెరకెక్కించిన సన్నివేశాలకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలెట్టేశారు. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్య తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ఆదివారం ఉదయం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. సాయింత్రం క్రిష్ పెళ్లికి వెళ్లేంత వరకూ బాలయ్య నాన్ స్టాప్‌గా డబ్బింగ్ చెబుతూనే ఉన్నాడట.
ఈరోజు కూడా డబ్బింగ్ చెబుతూనే ఉన్నాడు. సుదీర్ఘమైన సంభాషణల్ని అలవోకగా పలికేస్తున్నాడట. డబ్బింగ్ కోసం ఆరు రోజులు కేటాయిస్తే… రెండు రోజుల్లోనే మొత్తం డైలాగులు చెప్పేశాడట. బాలయ్య అంతే మరి… ఏదైనా ఫటాఫట్! దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈనెలాఖరున హైదరాబాద్‌లో షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఆ తరవాత మధ్యప్రదేశ్ లోని అరుదైన లొకేషన్లలో గౌతమి పుత్ర కి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.