మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తెరంగేట్రం చేసి సూపర్ స్టార్ మేనియాను కొనసాగిస్తున్నాడు. చేసిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ అవుతున్న ఈ హీరో రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో ఓకే బంగారం అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు దుల్కర్ తెలుగు డబ్ చెప్పింది హీరో నానినే. ఇప్పుడు మరోసారి దుల్కర్ తన ఉస్తాద్ హోటల్ సినిమా ‘జతగా’ వస్తుంది. సురేష్ కొండేటి తెలుగులో డబ్ చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలవ్వనుంది.
ఎస్.కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సురేష్ కొండేటి నిర్మిస్తున్న ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ ను మళ్లీ నాని చేత చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరో మరోసారి జతగా అంటూ వస్తున్నాడు. నిత్యా మీనన్ జతగా నటించిన ఈ సినిమా ఉస్తాద్ హోటల్ గా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ జోష్ లో ఉన్న నాని దుల్కర్ సల్మాన్ ‘జతగా’ సినిమా డబ్ చెప్పడం సాధ్యపడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. భలే మగాడు హిట్ జోష్ ని ఎంజాయ్ చేస్తున్న నాని 14 రీల్స్ తో తను చేస్తున్న తర్వాత మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అదేగాక తనకు అష్టాచెమ్మ లాంటి డెబ్యూ హిట్ ఇచ్చిన డైరక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో నాని దుల్కర్ సినిమాకు డబ్బింగ్ చెబుతాడా లేదా అన్నది కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది. కాని ఉస్తాద్ హోటల్ తెలుగు డబ్ చేస్తున్న సురేష్ మాత్రం ఎలాగైనా నానిని ఒప్పించి దుల్కర్ కి డబ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట.