దుల్కర్ సల్మాన్…. ఈ మలయాళీ నటుడు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. కొన్ని డబ్బింగ్ సినిమాలతో.. మనవాళ్లకు దగ్గరయ్యాడు. తను చేసిన ఒకే ఒక్క స్ట్రయిట్ సినిమా… మహానటి. ఇప్పుడు `సీతారామం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయవాడ, విశాఖపట్నంలో ఈవెంట్లు నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్లు దుల్కర్ క్రేజ్‌కి అద్దం పట్టాయి. రెండు చోట్లా.. దుల్కర్‌ని చూడ్డానికి జనం ఎగబడ్డారు. ఎయిర్ పోర్టు నుంచే.. జనం దుల్కర్‌ని చూడ్డానికి, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. సాధారణంగా… ఓ స్టార్ హీరో ఈవెంట్లకు ఎంత జనసందోహం హాజరవుతుందో, `సీతారామం`కీ అంతేమంది జనం వచ్చారు. ఈ క్రౌడ్‌లో అమ్మాయిలూ కనిపించడం విశేషం. దుల్కర్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇవన్నీ `సీతారామం`కి ప్లస్ అవుతాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. దుల్కర్ కూడా `సీతారామం`పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు. మలమాళంలో ఓ సినిమా చేసినా.. ప్రమోషన్లకు ఇంత టైమ్ వెచ్చించని దుల్కర్.. `సీతారామం` కోసం ఇంకొంచెం ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగులోనూ దుల్కర్ సెటిల్ అవుదామని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఈనెల 5న సీతారామం విడుదల అవుతోంది. ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలకు రావడం బాగా తగ్గించేశారు. ఏ సినిమాకీ సరైన ఓపెనింగ్స్ ఉండడం లేదు. `సీతారామం` ఓపెనింగ్స్ గనుక అదిరిపోతే.. అదంతా దుల్కర్‌కి ఉన్న క్రేజ్ అనే అర్థం చేసుకోవాలి. మరి దుల్కర్‌కి అంత ఉందా, లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.