‘మహానటి’,‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడాయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ‘లక్కీ భాస్కర్’ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈద్ సందర్భంగా టీజర్ ని వదిలారు. ఓ మామలు మధ్య తరగతి బ్యాంక్ ఉద్యోగి చుట్టూ జరిగే కథ ఇది.
టీజర్ లో కథ గురించి హిట్ ఇవ్వలేదు కానీ టీజ్ చేశారు. ఒక మామూలు ఉద్యోగి నమ్మశక్యం కాని విధంగా కోట్ల రూపాయిల తన ఖాతాలో ఎలా జమ చేసుకున్నాడనే పాయింట్ ఆసక్తికరంగా వుంది.
”మిడిల్ క్లాస్ మెంటాలిటీ. మేము ఇంతే. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఖర్చు పెట్టేస్తాం’అని దుల్కర్ చెప్పిన డైలాగ్ కూడా కథలో కీలకంగా అనిపించింది.
దుల్కర్ లుక్, ప్రజన్స్ బావుంది. మీనాక్షి చౌదరి ఓ ఫ్రేం లో కనిపించింది. టీజర్ లో చూపించిన వింటేజ్ ముంబై, బ్యాంక్ యాంబియన్స్ సహజంగా కదిరాయి. జి.వి.ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి దర్శకుడు వెంకీ అట్లూరి పాన్ ఇండియా ఆడియన్స్ ద్రుష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.