రివ్యూ: డంకీ

Dunki Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 2.5/5

ప్రస్తుతం నడుస్తున్న కమర్షియల్ మాస్ యాక్షన్ ట్రెండ్ ని పట్టుకొని జవాన్, పఠాన్ లాంటి రెండు భారీ విజయాలు అందుకున్న షారుక్ ఖాన్… ట్రెండ్ తో సంబంధం లేకుండా తన స్టయిల్ లోనే ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తో కలసి ‘డంకీ’ సినిమాతో ప్రేక్షుకుల ముందుకు వచ్చారు. ఏడాది షారుక్ కి ఇది మూడో చిత్రం. రెండు వెయ్యికోట్ల సినిమాల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా, దేశంలో అగ్రదర్శకుల్లో ఒకరైన హిరాణీ సినిమా కావడంతో సహజంగానే ‘డంకీ’ పై అంచనాలు ఏర్పడాయి. మరా అంచనాలని డంకీ అందుకుందా ? షారుక్ కి హ్యాట్రిక్ విజయం దక్కిందా? హిరాణీ మరో మరపురాని చిత్రాన్ని అందించారా?

అది పంజాబ్ లోని ఓ పల్లెటూరు. మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్రమ్ కొచ్చర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌).. ఈ నలురుగు ఇంగ్లాండ్ వెళ్లాలని కలలుకంటారు. మన్ను, బుగ్గు, బల్లి ఈ ముగ్గురి టార్గెట్ అక్కడ డబ్బులు సంపాయించి ఇక్కడ కష్టాలు నుంచి గట్టెక్కడం. సుఖిది మరో సమస్య. అయితే అక్కడి వెళ్ళాలంటే డబ్బు, అర్హత గల చదువు వుండాలి. కానీ వీరికి ఆ అర్హతలు ఏమీ వుండవు. ఏం చేయాలని అలోచిస్తున్నప్పుడు అదే సమయంలో జ‌వాన్ హ‌ర్ ద‌యాల్ సింగ్ థిల్లాన్ అలియాస్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) ఆ వూరికి వ‌స్తాడు. అతనికి ఆ నలుగురితో స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళ సమస్య తెలుసుకొని స్టూడెంట్ విసాతో వెళ్ళొచ్చనే మార్గం చెబుతాడు. దీనికి కోసం అందరూ ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకుంటారు. కానీ వీరిలో ఒక్కరికే ఆ విసా వస్తుంది. ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్న మిగతా నలుగురు డంకీ ఫ్లైట్స్ (అక్రమ వలస)తో దేశాల సరిహద్దులు దాటి లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. మరా డంకీ ప్రయాణం ఎలా సాగింది ? అందరూ ఇంగ్లాండ్ చేరుకున్నారా ? ఈ ప్రయాణంలో మన్ను, హార్డీల మధ్య చిరురించిన ప్రేమ ఏ తీరాలకు చేరింది ? అనేది మిగతా కథ.

కమర్షియల్ అంశాలతోనే కాకుండా మనసుని హత్తుకునే సున్నితమైన హాస్యం, భావోద్వేగాలతో కూడిన కథలతో కూడా మాస్ ని ఆకట్టుకోవచ్చని నిరూపించిన దర్శకుడు హిరాణీ. ఆయన సినిమాలేవీ కూడా విజువల్ వండర్స్, మైండ్ బెండింగ్ కాన్సప్ట్స్ కాదు. మనకి నిత్యం ఎదురయ్యే ఒక సామాజిక అంశమే ఆయన కథకు ముడిసరుకు. ఒక సామాజిక అంశాన్ని ఆయన పట్టుకునే తీరు, తెరపై నవ్వులతో మనసుని హత్తుకునేలా చేసి ఆలోజింపచేసే విధానం అసాధారణంగా వుంటాయి. డంకీ కోసం కూడా ఆయన ఒక సామాజిక అంశాన్నే పట్టుకున్నారు. పంజాబ్ ప్రాంతంలో ఎక్కువగా జరిగే అక్రమ వలసల నేపధ్యాన్ని తీసుకొని మనుషులు మధ్య గీసుకున్న సరిహద్దుల గురించి తనదైన శైలిలో ఒక ఆలోచన రేకెత్తించే చిత్రాన్ని తీశారు.

హిరాణీ తన సినిమాలకి ఒక ప్రత్యేకమైన ఫార్ములా రాసుకున్నారు. ఎల్.సి.డి.( లాఫ్, క్రై, డ్రామా). నవ్వించి కన్నీళ్ళు తెప్పించి డ్రామాని క్రియేట్ చేయడం ఆయన మార్క్. డంకీ సన్నివేశాలు కూడా అదే తరహలో సాగుతాయి. హార్డీ కోసం మను చేసిన ఫోన్ కాల్ తో కథని ఆసక్తి మొదలుపెట్టారు, తర్వాత కథ గతంలోకి వెళ్ళడం, నలుగురు స్నేహితులు లండన్ వెళ్లాలని నిర్ణయించుకోవడం, హార్డీ పాత్ర పరిచయం, వీసా కష్టాలు, ఇంగ్లీష్ పాఠాల తిప్పలు.. ఇవన్నీ సరదాగా సాగుతాయి. ఐతే ఇందులో విరామం వరకూ కథలో పెద్ద మలుపులు కనిపించవు. విక్కీ కౌశల్ రూపంలో ఓ ట్రాజడీ చేటు చేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ కి కావాల్సిన డ్రామా బిల్డ్ అవుతుంది కానీ అంతకుముందు జరిగిన సన్నివేశాలు కేవలం హ్యుమర్ కోసమేనా అన్నట్లుగా వుంటాయి. త్రిఇడియట్స్ లో స్పీచ్ సీన్ లా ఇందులో రెండు నిమిషాల ఇంగ్లీష్ టెస్ట్ వుంటుంది. అది భలే వర్క్ అవుట్ అయ్యింది.

సెకండ్ హాఫ్ లో అసలు డంకీ ప్రయాణం మొదలౌతుంది. దేశ సరిహద్దులని అక్రమంగా దాటే సన్నివేశాలని చాలా ప్రభావంతగా చిత్రీకరించారు. నిజనికి అక్రమ వలసలు అంటే డార్క్ ఎలిమెంట్. వాటిని కూడా హిరాణీ స్టయిల్ లో కాస్త షుగర్ కోటింగ్ ఇచ్చి తీశారనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక లండన్ చేరిన తర్వాత వచ్చిన సన్నివేశాలు నవ్విస్తూనే గుండెబరువెక్కేలా తీశారు. ముఖ్యంగా కోర్ట్ సీన్ లో చాలా అంశాలని టచ్ చేశారు. జడ్జ్ తో జరిగిన సంభాషణలో షారుక్ పలికిన మాటలు ఈ కథలో సారాన్ని చూపిస్తాయి. నిజంగా ఆ పరిస్థితులు ఎదురుకున్న వారికి ఈ ఇందులో చూపించిన కంటెంట్ ఇంకా బలంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది. ఈ కథకు ఇచ్చిన మను హార్డీల ప్రేమకథ ముగింపు కాస్త సినిమాటిక్ గా అనిపిస్తుంది. అలాంటి ట్రీట్మెంట్ కథలో కొన్ని సినిమాల్లో చూడటం కారణంగా ఊహకుముందే అందిపోతుంది.

నాలో నటుడి కోసం చేసిన సినిమా ఇదని చెప్పారు షారుక్. నిజమే… హార్డీ పాత్రకు పెద్ద హీరోయిజం ఏమీ వుండదు. హిరాణీ మార్క్ హీరోయిజంతో హార్డీ పాత్రలో ఒదిగిపోయాడు షారుక్. నవ్వులు పంచడంతో పాటు మనసుని బరువెక్కించే సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన తర్వాత తాప్సీ ప్రయాణం మారిపోయింది. ఇందులో చేసిన మను పాత్ర ఆమె కెరీర్లోనే వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పొచు. స్వతహాగా ఆమె పంజాబీ కావడంతో యాస విషయంలో కూడా ఆమెకు మరింత పట్టుదక్కింది. విక్కీ కౌశల్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అతని పాత్రని రెండో సగంలో కూడా వాడుకున్న తీరు హిరాణీ రైటింగ్ బ్రిలియన్స్ కి అద్దంపడుతుంది. తన పాత్ర వరకూ పూర్తి న్యాయం చేశాడు విక్కీ. స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ గా బోమన్ ఇరానీ తన అనుభవాన్ని చూపించారు. మిగతా ఇద్దరు స్నేహితులు కూడా అలరిస్తారు. మిగతా పాత్రలన్నీ పరిధిమేర వుంటాయి.

టెక్నికల్ సినిమా బావుంది. తొలి సగం పంజాబ్ పల్లెటూరిలో నడిచినప్పటికీ తర్వాత వచ్చే దేశాల సరిహద్దులు, లండన్, దుబాయి.. ఈ సన్నివేశాలన్నీ దాదాపు రియల్ లోకేషన్స్ లో షూట్ చేయడం వలన తెరపై కొత్త అనుభూతి కలుగుతుంది. పాటలు, నేపధ్య సంగీతం హిరాణీ మార్క్ లో వున్నాయి. ఈ చిత్రనికి ఎడిటర్ హిరాణీనే. ఆయన నడిపిన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ప్యాట్రన్ త్రీఇడియట్స్ తో పాటు ఆయన గత చిత్రాలని గుర్తుకు తెస్తుంది. నిడివి విషయంలో సమస్య వుండదు. సన్నివేశాల్లో సాగదీత లేకుండా చుసుకున్నారు. అయితే ఇది పూర్తిగా సంభాషణలు ఆధారంగా నడిచే సినిమా. బాగా హిందీ వచ్చిన వాళ్ళకి కూడా పంజాబీ యాస కొన్ని చోట్ల బౌన్స్ కొట్టే అవకాశం వుంది. అలాంటి సమస్య ఎదురితే మాత్రం కొన్ని డైలాగ్స్ కనెక్ట్ కాకపోవచ్చు. డంకీలో హిరాణీ మార్క్ నవ్వులు, ఎమోషన్స్ వున్నాయి. అయితే ఆయన త్రీఇడియట్స్, పీకే, మున్నాభాయ్ సినిమాలతో పోలిక పెట్టుకొని డంకీ చూస్తే మాత్రం ‘ఇంతేనా.. ఇంకా ఎదో ఉండాల్సింది కదా’ అనే భావన కలుగుతుంది.

తెలుగు360 రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close