‘డీజే’ తొలి ట్రైలర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. మాసీగానే ఉన్నా – కొత్తగా చూడ్డానికీ చూపించడానికీ ఏమీ కనిపించకపోవడంతో కాస్త నిరాశ ఎదురైంది. దాన్ని గుర్తు పెట్టుకొనే కాబోసు.. రెండో ట్రైలర్‌ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దించేసింది చిత్రబృందం. ఇది కూడా అదిరిపోయేలా ఏం లేదు గానీ… తొలి ట్రైలర్‌తో పోలిస్తే కాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చిందనే అనుకోవాలి. ఎప్పట్లా…బ్రాహ్మిణ్ స్లాంగ్‌లో బన్నీ అల్లుకుపోయాడు. యాక్షనూ.. ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి గట్టిగా కొట్టాడు హరీష్ శంకర్. కొత్త డైలాగులు, గుర్తుండిపోయే సింగిల్ లైన్లూ పడలేదు గానీ… ఈ ట్రైలర్ కూడా ఫ్యాన్స్‌కి తెగ నచ్చేస్తుంది. బన్నీలోని బలాల్ని కొత్త కోణంలో ఎలివేట్ చేయడానికి హరీష్ శంకర్ పడిన కష్టం.. ఈ బుల్లి ట్రైలర్లో కనిపిస్తుంది. ఈ వేవ్ లెంగ్త్ వెండి తెరపైనా ప్రదర్శిస్తే.. టాలీవుడ్ కి మరో మాస్ ఎంటర్టైన్ మెంట్ వచ్చేసినట్టే. ”కొడుతున్నాం సర్… ఈసారి గట్టిగా కొడుతున్నాం” అనే బన్నీ కాన్ఫిడెన్స్ చూస్తే.. గట్టిగా కొట్టేలానే ఉంది… డీజే సినిమా!!