దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీలు ఇప్పుడు టీవీ చానళ్లకు ఎక్కి తమ రసవత్తరమైన ప్రేమ కథ గురించి కథలు కథలుగా చెప్పుకునేందురు రెడీ అయ్యారు. ఎవరు పిలిచినా ఇంటర్యూలు ఇచ్చేస్తున్న జంటను తమ చానల్లోకి ఆహ్వానించి ప్రైమ్ టైమ్ కూర్చోబెట్టి వినోదం పంచాలని టీవీ9 నిర్ణయించుకుంది. వారిదేమైనా ప్రజా సమస్యనా అంటే.. అంతకు మించిన ఎంటర్టెయిన్మెంట్ ఎక్కడ దొరుకుతుందని.. ప్రజలకు కావాల్సిందే ఇస్తామని రెడీ అయిపోయారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వ్యూస్ బాగా వస్తున్నాయని అందరూ అదే టాపిక్ పై పడ్డారు. ఇప్పుడు తమ ఇంటి బాగోతాన్ని .. వ్యవహారాన్ని మీడియాకు ఎక్కించుకునేందుకు ఈ జంట రెడీ అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయిన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం సభ్యసమాజానికి చెడు సంకేతాలు పంపేలా ఉంది. అయినా మీడియా దాన్ని నుంచి ఎదో పిండుకునే ప్రయత్నం చేస్తోంది.
దువ్వాడ, దివ్వెల వ్యవహారాన్ని బతుకు జట్కా బండి తరహా ఇంటర్యూలుగా ప్రసారం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు రెడీ అయిపోయారు. ఇంకా విడాకులు రాకుండానే అడల్టరీ చేసేసుకుంటున్నామని సుప్రీంకోర్టు తప్పు కాదని చెప్పిందని వీరు చేస్తున్న నిర్వాకం ప్రజలకు అసహ్యంగా మారుతోంది.