టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు, మీడియా యాంకర్లు తమను కామెడీ చేస్తున్నారని .. ప్రజల ముందు ఓ క్యారెక్టర్ లెస్ కపుల్ గా నిలబెడుతున్నారని గ్రహించలేకపోతున్న దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురీ తమకు బోలెడంత క్రెజ్ వచ్చిందనుకుని మైకుల ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. పవన్ ను విమర్శించామనుకుని ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నారు. జగన్ ను పొగుడుతున్నామనికి మరింత పలుచన చేస్తున్నారు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు.
తాత కూడా అయిన దువ్వాడ శ్రీనివాస్, ముగ్గురు ఆడపిల్లల తల్లి అయిన దివ్వెల మాధురీ విషయంలో మీడియా చానళ్లు.. ప్రజలు చూస్తారు మేము ప్రసారం చేస్తామన్నట్లుగా హైలెట్ చేస్తున్నాయి. ఇంటర్యూల్లో వాళ్ల కు పుట్టబోయే బిడ్డల గురించి ప్రశ్నిస్తున్నారు. కాస్తయినా హుందాగా ఉండాల్సిన వారు నిస్సంకోచంగా పిల్లల్ని కంటామని.. పుట్టే వాళ్లకు జగన్ పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. వారు చెబుతున్న సమాధానాలతో జగన్ నూ టోల్ చేస్తున్నారు ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.
తాజాగా వారిపై రీల్స్ చేసినందుకు తిరుమలలో కేసు నమోదు అయింది. అయితే అది పవన్ కల్యాణే పెట్టించారంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. టీవీ చానళ్లలో తాము పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడామని అందుకే కేసు పెట్టించారని అంటున్నారు. వీరి వ్యవహారశైలితో ఇప్పుడు జనసైనికులు కూడా వారిపై విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో.. ప్రజల ముందు వీరిని టీవీ చానళ్లు ఎలా ప్రజెంట్ చేస్తున్నాయో కనీసం ఆలోచించకుండా వీరు చేస్తున్న పనులతో వారి కుటుంబసభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని సామాన్య జనం నుంచి విమర్శలు వస్తున్నాయి.