వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీని ఎలా బలోపేతం చేయాలా అన్న అంశంపై జగన్ తో విస్తృత మంతనాలు జరిపేసి ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ ఆ బాధలు ఆవేమీ కనిపించనీయకుండా ఆయనను ప్రేమలోకంలో విహరింప చేసేందుకు దివ్వెల మాధురీ ఎప్పుడూ రెడీగా ఉంటారు. తన పేరుతో రాయించేసుకున్న ఇంట్లోనే స్కూటర్‌పై జంటగా తిరుగుతూ వీడియోలు కూడా చేస్తున్నారు.
వారిద్దరూ వ్యక్తిగతం ఏమైనా చేసుకుంటే అందరూ గుసగుసల దగ్గరే ఉండిపోతారుకానీ తాము మరో టైపు అని ఆ జంట తమ వీడియోల్ని సోషల్ మీడియాలో కూడా పెట్టుకుంటున్నారు. అందుకే వారి లైఫ్ పబ్లిక్ లోకి వచ్చేసింది. ఎవరు ఏమంటున్నా.. తానుప్రజా ప్రతినిధిని.. ఎమ్మెల్సీని అనే విషయాన్ని దువ్వాడ అసలు గుర్తుంచుకోవడం లేదు. ఆయనకు కుటుంబం కన్నా దివ్వెల మాధురీనే ఎక్కువ అన్నట్లుగా లైఫ్ సాగుతోంది. ఇటీవల ఆయన వాలంటీర్ పేరుతో హీరోగా ఓ సినిమా చేశారు. దాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. అందులో దివ్వెల మాధురీ కనిపించలేదు. మరోసారి ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ఏమైనా చేసే ఉద్దేశం ఏదో ఉందన్నట్లుగా ఎప్పుడూ కెమెరా మెన్ ను వెంట బెట్టుకునే తిరిగుతున్నారు.
వీరిద్దరి వ్యవహారశైలి వైసీపీకి పెనుశాపంగా మారింది. అయితే ఇలాంటివి ప్లస్ అనుకుంటున్నారేమో కానీ జగన్ పెద్దగా స్పందించడం లేదు. వరుసగా ఐదో సారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడను ఇంచార్జ్ గా మాత్రమే తీసేశారు. కానీ పార్టీలో మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీకి అంతకు మించి చాయిస్ లేదని భావిస్తున్నారు., అయితే తన భార్య నిప్పు అని.. విదేశాల్లో ఉండి వీడియో చేసిన దివ్వెల మాధురీ భర్త ఇప్పుడు పరిణామాలపై ఏమనుకుంటారోనని ఆయన సంప్రదించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు.