దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ హైదరాబాద్ లో చీరల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం మియాపూర్ లో భవనం తీసుకుని అందులో వకులా శిల్క్స్ పేరుతో దుకాణాన్ని సిద్ధం చేసుకున్నారు. దీనికి వీరిద్దరే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. దివ్వెల మాధురీనే తన షోరూం చీరలకు బ్రాండింగ్ చేసుకుంటున్నారు. ఆమెకు జంటగా దువ్వాడ వీడియోల్లో కనిపిస్తూ.. వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు.
విశాఖలో వ్యాపారం చేసుకోవడానకన్నా వారు హైదరాబాద్ లో దుకాణం పెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవలి కాలంలో వారు ఈ దుకాణం పని మీదనే ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అరెస్టులు చేయలేదు. వరుసగా కేసులు నమోదు కావడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. శాసనమండలిలోనూ పెద్దగా మాట్లాడటం లేదు. మామూలుగా అయితే సాక్షి మైకుల ముందు రెచ్చిపోయేవారు.
వకుళా సిల్క్స్ దుకాణం పబ్లిసిటీ కోసం దివ్వెల మాధురీ సోషల్ మీడియా చానళ్లకు ఇంటర్యూలు ఇస్తున్నారు.ఈ దుకాణానికి అవసరమైన పెట్టుబడి ఎవరిచ్చారన్నది మాత్రం బయట పెట్టడం లేదు. కనీసం పది కోట్లు ఖర్చయ్యే స్థాయిలో దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యాపారం మీదనే ఈ జంట ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెబుతున్నారు.