నోటి దూల ఎక్కువగా ఉండే దువ్వాడ శ్రీనివాస్ … అచ్చెన్నాయుడు దగ్గర నుంచి పవన్ కల్యాణ్ వరకూ అందర్నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. పైన జగన్ రెడ్డి అండ ఉందని.. అలాంటి మాటలకు మెచ్చి ఆయన ఏం అడిగితే అది ఇస్తారన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని జగన్ నిజం చేశారు కూడా. అందుకే ఆ పార్టీలో ఇంత మంది తేడాగా ఉన్నారు. ఇదే దువ్వాడ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఏకపత్నీ వ్రతం మన సమాజ లక్షణం అని సాక్షి టీవీలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు.
కానీ పవన్ ఏం చేసినా చట్ట ప్రకారం చేశారు. ఆయన అన్యాయం చేశారని ఎవరూ బయటకు రాలేదు. ఇక్కడ దువ్వాడ సొంత భార్య బిడ్డలను అన్యాయం చేశారని వారే రోడ్డెక్కారు. న్యాయం అడిగితే దువ్వాడ వాళ్లను కొట్టడానికి వెళ్తున్నారు. రోడ్డున పడటం అంటే ఇదే. ఇంత ఘోరమైన సిక్ మైండ్ తో ఉన్న దువ్వాడ.. తాము అడల్టరీ చేస్తున్నామని నిస్సిగ్గుగా చెప్పుకునేందుకు మహిళను మీడియా ముందుకు పంపారు కూడా. ఆమె కూడా.. ఏ మాత్రం పట్టింపు లేకుండా అడల్టరీ తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని వాదించేశారు.
దివ్వెల మాధురీ అనే మహిళ పెట్టిన ప్రెస్మీట్ అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇలాంటి కారణాల మీద ప్రెస్ మీట్ పెడతారా.. మళ్లీ అడ్డగోలుగా సమర్థించుకుంటారా అని.. చేసేది గుడిసేటి పనులు.. దానికి చట్టం ముసుగు, కుటుంబాల్ని నాశనం చేయమని కోర్టులు చెప్పవు.. భార్యాబిడ్డల్ని అలా రోడ్డున పడేసి వెళ్లిపోవాలని కూడా కోర్టులు చెప్పవు. ఇలా కుటుంబాన్ని రోడ్డున పడేసుకోవాలని కూడా చెప్పవు. కానీ అదేదో సాధించినట్లుగా ప్రెస్మీట్లు పెట్టుకుని చెలరేగిపోతున్న దువ్వాడ శ్రీను అడల్టరీ వ్యవహారం … రాష్ట్ర ప్రజల్ని నివ్వెర పరుస్తోంది.