దువ్వాడ శ్రీనివాస్ నోరు చాలా పెద్దదని జగన్ కు చాలా ఇష్టం. ఎందుకంటే జగన్ కు ఎలా కావాలో అలా అచ్చెన్నాయుడును తిట్టేవారు. అసలు అచ్చెన్న ఆయనను పట్టించుకునేవారు కాదు అది వేరే విషయం. ఇప్పుడు ఈ దువ్వాడ వైసీపీకి పెద్ద భారంగా మారిపోయారు. ఆయన ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా… తాము స్వేచ్చా సమాజానిక ప్రతినిధులం అన్నట్లుగా వారు టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు కామెడీ అవుతున్నాయి.
దవ్వాడ అంటే దివ్వెల మాధురీకి పెద్ద హీరో కావొచ్చు కానీ ఆమె మొత్తం వైసీపీకే పెద్ద హీరో అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. తమ వ్యక్తిగత విషయంలో వైసీపీని , జగన్ ను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతూండటాన్ని కంట్రోల్ చేయాలని చేసిన ప్రయత్నం వికటించింది. దువ్వాడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడని.. ఏ పార్టీ అవసరం లేదని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు రచ్చ అవుతున్నాయి. దువ్వాడ వైసీపీలో పుట్టి పెరగలేదు. ఆయన చాలా పార్టీలు మారారు. చివరికి పీఆర్పీ కూడా. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. చివరికి ఎమ్మెల్సీ ఇస్తే ప్రజాప్రతినిధిని అని పిలిపించుకుంటున్నారు.
దువ్వాడ , దివ్వెల ఇలా రోడ్డున పడి చేస్తున్న రచ్చ వారి వ్యక్తిగతం అనుకోవడానికి అవకాశం లేకుండా పోయింది . వారేం చేసినా వైసీపీతో లింక్ పెట్టి చూసేవారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో … ఆ పార్టీకి కూడా సమస్యగా మారింది. వారిని వీలైనంత వరకూ సైలెంట్ గా ఉంచకపోతే వైసీపీ నష్టపోతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కానీ వారిని కంట్రోల్ చేయాలని చూస్తే ఇంకెంత రెచ్చిపోతారో అని ఆందోళన చెందుతున్నారు.