మన చుట్టూ కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఔరా అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. అలాంటిదే ఇది కూడా. సమాజానికి విశిష్ట సేవలు అందించినందుకు దువ్వాడ శ్రీనివాస్ కు డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ అనే సంస్థ డాక్టరేట్ ఇచ్చింది. దాన్ని తీసుకోవడానికి దువ్వాడ నల్లగౌనులో.. టోపీ పెట్టుకుని .. తన సహజీవన భాగస్వామి దివ్వెల మాధురీతో కలిసి వెళ్లారు. డాక్టరేట్ తీసుకున్నారు. వచ్చిన వాళ్లంతా దువ్వాడ శ్రీనుతో పాటు దివ్వెల మాధురీని కూడా అభినందించారు.
దువ్వాడ శీను ఇప్పటి వరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదుసార్లు ఓడిపోయారు. ఒక్క సారి ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఆ సమయంలోనూ ఆయన వివాహేతర బంధంలో మునిగిపోయి.. ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం మాత్రం ఆయన చేయగలిగిందేమీ లేదు. కుటుంబాన్ని, కూతుళ్లను ఘోరంగా తిట్టి.. నైతికత అనేది లేకుండా ప్రవర్తించినందుకు ఆయనకు డాక్టరేట్ ఇచ్చి ఉంటారు.
ఇంతకీ ఈ డే స్ప్రింగ్ యూనివర్శిటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే.. సికింద్రాబాద్ లో ఓ చిన్న గదిలో ఉంటుంది. అది క్రిస్టియన్ అంటే బైబిల్ పాఠాలు చెబుతామని ఆ వెబ్ సైట్ లో ఉంది. ఎలాంటి గుర్తింపు లేదు. అయినా ఈ వయసులో చేస్తున్న పనులకు పొంతనలేని అంశంలో డాక్టరేట్ ఇస్తామని ఆ సంస్థ చెప్పడం ఏమిటో.. దివ్వెల మాధురీతో సహా పోయి తీసుకోవడం ఏమిటో.. దువ్వాడకే తెలియాలి.