దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురీ – దువ్వాడ శ్రీవాణి ట్రయాంగిల్ ఫ్యామిలీ సర్కస్లో మొత్తానికి దువ్వాడ బలిపశువు అవబోతున్నాడని జరుగుతున్న పరిణామాలన్నీ నిరూపిస్తున్నాయి. దివ్వెల మాధురీ భర్త తాను అమెరికాలో ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తూ రిలీజ్ చేసిన వీడియోను పరిశీలిస్తే.. భర్తతో కలిసే దివ్వెల మాధురీ పకడ్బందీగా దువ్వాడ శ్రీనును ట్రాప్ చేసిందని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది.
ఓ వైపు అడల్టరీ రిలేషన్ లో ఉన్నామని దువ్వాడ తో పాటు మాధురీ చెబుతున్నారు. కానీ ఆయన భర్త మాత్రం.. ఎవరో చెబితే తాను నమ్మబోనని తన భార్యపై నమ్మకం ఉందని చెబుతున్నారు. పైగా తాను నెలకు పది లక్షలు సంపాదిస్తానని. ఆ మొత్తం మాధురీకే ఇస్తానని చెబుతున్నారు. మాధురీకి రాజకీయంగా ఎదగాలని ఆకాంక్ష ఉందని ఆమె తాను అండగా ఉంటానని చెప్పారు. అంటే మాధురీ రాజకీయ భవిష్యత్ కోసమే దువ్వాడను ట్రాప్ చేసిందని అర్థమైపోతుంది.
ఆ దంపతుల ప్లాన్ చూస్తే.. రాజకీయంగా వాడేసుకుని దువ్వాడను కరివేపాకు చేయడానికి రెడీ అయ్యారని అంచనా వేయవచ్చు. ఇప్పుడు దువ్వాడ తన కుటుంబంతో విడిపోవడానికి రెడీ అయ్యారు. మొత్తం ఆస్తులు ఇచ్చేసి మీ దోవ మీరు చూసుకుంటే మాకేం ఇబ్బంది లేదని.. ఆస్తులు తీసుకెళ్లి మాధురీకి ఇస్తానంటే ఒప్పుకునేది లేదని శ్రీవాణి అంటున్నారు. అంటే ఇప్పుడు దువ్వాడకు మరో మార్గం లేదు.
అంటే ఆస్తులతో పాటు సొంత కుటుంబాన్ని ఆయన వదిలేసుకుని మాధురీ దగ్గరకు వెళ్తే. .. ఆయన రాజకీయ జీవితం కూడా రిస్క్ లో పడిపోయింది కాబట్టి మాధురీ ఎంతో కాలం ఆయనను భరించదు. వదిలేస్తుంది. అప్పుడు దువ్వాడ రోడ్డు మీద పడతాడు. ఈ ట్రాప్ అర్థం చేసుకోలేకపోతే దువ్వాడ నిండా మునిగిపోయినట్లే అనుకోవచ్చు.