శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడుపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకునే లీడర్ దువ్వాడ శ్రీనివాస్ కు చివరికి టిక్కెట్ లేకుండా పోయింది. ఆయనే అభ్యర్థి అని జగన్ .. టెక్కలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చెప్పారు.. మొన్న మూలపేట పోర్టు శంకుస్థాపనలో చెప్పారు. అయినా సరే ఇవాళ సీన్ మారిపోయింది. స్వయంగా దువ్వాడ శ్రీనివాసే ప్రెస్ మీట్ పెట్టి ..తాను కాదు తన భార్య పోటీ చేస్తున్నారని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ను చూసి జిల్లా మొత్తం నవ్వుకుంటున్నారు.
అచ్చెన్నాయుడును బండ బూతులు తిట్టి.. సీఎం జగన్ మెప్పు పొందారు దువ్వాడ శ్రీనివాస్. నియోజకవర్గంలో అందరూ ఆయనను వ్యతిరేకించినా అచ్చెన్నాయుడు పై బూతులకు జగన్ మెచ్చడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. జిల్లాలో చాలా వరకూ చక్రం తిప్పారు. అయితే ఆయన ఓ మహిళ తో వివాహేతర బంధంలో చిక్కుకున్నారు. ఆ మహిళ చెప్పినట్లే జిల్లాలో అధికారుల పోస్టింగ్లు..ఇతర పనులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టింది. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి దగ్గరకు చేరడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి.
ఇదే అదనుగా జడ్పీటీసీగా ఉన్న ఆమె.. వైసీపీ హైకమాండ్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇవ్వాలని పట్టుబట్టారు. లేకపోతే మీడియా ముందు తన భర్త బాగోతాన్ని బయట పెడతానని హెచ్చరించారు. ఈ విషయం గోల గోల కావడంతో హైకమాండ్ రాజీ చేసే ప్రయత్నం చేసింది. కొన్నాళ్ల కిందట ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టి.. మా మధ్య గొడవల్లేవని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా దువ్వాడ శ్రీను మారకపోవడంతో.. ఆమె ఫైనల్ అల్టిమేటం ఇచ్చారు. చివరికి ఈ గోల ఎందుకని..దువ్వాడ వాణినే అభ్యర్థిగా ఖరారు చేసినట్లగా తెలుస్తోంది. దీంతో భార్య చేతిలో ముందే ఓడిపోయాడని దు్వ్వాడ శ్రీనుపై జోకులు వేస్తున్నారు.