విశాఖపట్నం ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ నివాసం ఉండాలనుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సేవా రంగాన్ని ప్రభుత్వం అక్కడ విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తూండటంతో రానున్న రోజుల్లో విశాఖ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో హాట్ ప్రాపర్టీగా మారనుంది. ఈ విషయంలో దువ్వాడ ప్రాంతం మరింత దూసుకెళ్లే అవకాశం ఉంది. విశాఖపట్నం శివార్లలో ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న దువ్వాడ ఇప్పుడు అన్ని సౌకర్యాలతో హాట్ ప్రాపర్టీగా మారింది.
విద్యా సంస్థలు, పరిశ్రమలకు కేంద్రంగా దువ్వాడ మారింది. మంచి మంచి రోడ్లు ఉన్నాయి. విశాఖ సిటీలో ఎక్కడికైనా దువ్వాడ నుంచి పావుగంటలో చేరుకునే వెసులుబాటు ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఓ. పదేళ్ల కిందట చాలా స్లోగా ఉండేది.కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణం కనిపిస్తోంది. ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అక్కడ పెట్టుబడి పెట్టాలనుకునేవారి సంఖ్య బారీగా పెరుగుతోంది. గూగుల్ వంటి సంస్థలు త్వరలో రానున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాదిలో ప్రారంభం కానుంది. అందుకే దువ్వాడలో ఓపెన్ ప్లాట్లు, 2 BHK ఫ్లాట్లు మరియు విల్లాలకు డిమాండ్ పెరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి.
దువ్వాడలో ఇప్పటికే ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్లలో.. లగ్జరీ ఫ్లాట్ రూ. కోటి వరకూ పలుకుతోంది. ఇందులో రెండు వేల వరకూ ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇక వెయ్యి ఎస్ఎఫ్టీ ఉన్న అపార్టుమెంట్లలో యాభై లక్షల వరకూ లభిస్తున్నాయ. ఓ ఆరేడు లక్షలు ఎక్కువగా పెట్టుకుంటే త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ల లభిస్తున్నాయి. విశాఖ సిటీలో కొనలేని వారు.. కాస్త బడ్జెట్ లో మంచి ఇళ్లు కొనుక్కుని ప్రశాంతంగా ఉండాలంటే.. దువ్వాడ మంచి ప్రాంతం అనుకోవచ్చు.