పవన్ కల్యాణ్ చేతిలో మూడు సినిమాలున్నాయిప్పుడు. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వీరమల్లు’ సెట్స్‌పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలకూ అప్పుడప్పుడూ కొన్ని కొన్ని డేట్లు కేటాయిస్తున్నాడు పవన్. తాజాగా ‘వీరమల్లు’ షెడ్యూల్ ప్రారంభమైంది. పవన్ కూడా ఈ షెడ్యూల్ లో పాలు పంచుకోనున్నాడు. దాంతో.. మిగిలిన సినిమాల అప్డేట్లపై పవన్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ‘ఓజీ’ కోసం వాళ్లెంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ చెప్పమంటూ.. సోషల్ మీడియాలో అభిమానులు నిర్మాణ సంస్థకు రిక్వైస్టులు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే నేరుగా నిర్మాణ సంస్థ కు ఓ అభిమాని ”ఓజీ అప్డేట్ ఇచ్చి చావరా..” అంటూ ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశాడు. దాంతో నిర్మాణ సంస్థ కూడా బదులు ఇచ్చింది. ”అప్ డేట్ ఇవ్వకుండా చావను లేరా.. ప్రస్తుతానికి సీజ్ ద షిప్” అంటూ సమాధానం ఇచ్చింది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎన్నికల ముందు పిఠాపురం ఎమ్.ఎల్.ఏ తాలుకా అనేది ఎంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు ‘సీజ్ ద షిప్’ అంత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా అంతా ఇదే హావా. పవన్ అభిమానులు, జనసైనికులు ఈ పదాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఈ డైలాగ్ ని ‘ఓజీ’లో వాడమంటూ దర్శక నిర్మాతలకు సలహాలూ ఇస్తున్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యాకే, పవన్ మిగిలిన సినిమాలపై దృష్టి పెడతాడన్నది ఇన్ సైడ్ వర్గాల మాట. వీరమల్లు తరవాత ‘ఓజీ’, ఆ తరవాత ‘ఉస్తాద్’ సినిమాల్ని పూర్తి చేస్తాడు. ప్రస్తుతానికి పవన్ ముందున్న షెడ్యూల్ ఇదే.