మంత్రులు సమీక్షలు చేయవద్దని… తాము చెప్పలేదంటోంది.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం. ఈ మేరకు వ్యవసాయ శాఖాధికారులకు ఏపీ సీఈవో ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించే సమీక్షకు వెళ్లాలని వ్యవసాయాధికారులు నిర్ణయించుకున్నారు. మూడు రోజుల కింద.. సోమిరెడ్డి… ముందస్తుగా అందరికీ సమాచారం ఇచ్చి వ్యవసాయం, సాగునీరు, తుపాను, కరువు పరిస్థితులపై… సమీక్షించి తగు చర్యలు తీసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. కోడ్ పేరుతో… ప్రభుత్వాన్ని పూర్తిగా.. స్తంభింపచేసిన.. సీఎస్, సీఈవోల కారణంగా..సమీక్షకు రావడానికి వ్యవసాయ అధికారులు వెనుకడుగు వేశారు. దాంతో సోమిరెడ్డి… సమీక్షకు వచ్చి.. రెండు గంటల పాటు సచివాలయంలో ఎదురు చూసి.. అధికారులు ఎవరూ రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి… అసలు మంత్రులు కోడ్ ఉంటే..సమీక్షలు చేయకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని చాలెంజ్ చేశారు. అంతే కాదు.. సమీక్షకు రాని.. అధికారులు వివరణ ఇవ్వాలని లేఖలు పంపారు. మంత్రి లేఖలతో.. కంగారు పడిన అధికారులు… సీఈవో దృష్టికి… విషయాన్ని తీసుకెళ్లారు. సమీక్షకు వెళ్లొద్దని తాము చెప్పలేదన్న ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో..వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిది. దీంతో.. వెంటనే మంత్రితో టచ్లోకి వెళ్లారు. తాము సమీక్షకు వస్తామని.. వెంటనే…ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రికి సమాచారం పంపారు. దీంతో.. సోమిరెడ్డి… శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు.. తన చాంబర్లో సమీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయాధికారులందరూ హాజరయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి సమీక్షల విషయంలో సోమిరెడ్డి పోరాటం ఫలించినట్లే కనిపిస్తోంది. ఒక్క సోమిరెడ్డి మాత్రమే… కోడ్ను పెద్దగా చూపిస్తూ.. అసలు మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవన్నట్లుగా వాదిస్తూ వచ్చిన అధికారులపై.. ఓ రకంగా తిరుగుబాటు చేశారు. మిగతా మంత్రులంతా సైలెంట్ గా ఉన్నారు. కానీ సోమిరెడ్డి మాత్రం రూల్ బుక్ ..మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ముందు పెట్టుకుని… సీఈవో, సీఎస్ లను ప్రశ్నించడం ప్రారంభించారు. దాంతో.. కంగారుపడిన ఈసీ కూడా.. తాము సమీక్షలు చేయవద్దని చెప్పలేదని అధికారులకు క్లారిటీ ఇచ్చింది. ఇక మిగతా మంత్రులు కూడా తమ పని ప్రారంభించే అవకాశం ఉంది.