‘ఈగ‌ల్‌’ కీల‌క మీటింగ్‌… రిలీజ్ పై క్లారిటీ

ఈ సంక్రాంతికి 5 సినిమాలొస్తున్నాయి. అందులో ‘ఈగల్‌’ ఒక‌టి. 13న ‘సైంధ‌వ్‌’తో పాటుగా విడుద‌ల అవుతోంది. సెన్సార్ కూడా పూర్త‌య్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సంక్రాంతి పోటీ నుంచి ‘ఈగ‌ల్’ త‌ప్పుకొన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ర‌వితేజకు ఈమ‌ధ్య గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. దానికి తోడు ఎందుక‌నో `ఈగ‌ల్`పై బ‌జ్ లేదు. పైగా.. తీవ్ర‌మైన పోటీ. దాంతో.. ఈ సినిమాని జ‌న‌వ‌రి 26కి షిఫ్ట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 26 ర‌వితేజ పుట్టిన రోజు. ఆ సంద‌ర్భంగా ఈ సినిమా వ‌స్తే.. కాస్త బ‌జ్ వ‌స్తుంది, థియేట‌ర్లు పెరుగుతాయ‌ని ఆశ‌.

ఈరోజు ‘ఈగ‌ల్‌’ టీమ్ స‌మావేశం కానుంది. ర‌వితేజ‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌…. ఈ విష‌యంపై ఈ రోజు ఓ క్లారిటీకి రానున్నారు. ర‌వితేజ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయ‌మ‌ని ఫోర్స్ చేస్తున్న‌ట్టు టాక్. నిర్మాత మాత్రం కాస్త ఆగితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్ ఎనౌన్స్ చేసి, అక్క‌డ కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న కూడా ఉంది. అప్ప‌టికీ సంక్రాంతికే రావాల‌ని డిసైడ్ అయితే, సినిమాని విడుద‌ల చేసుకోవొచ్చు. లేదంటే పోస్ట్ పోన్ చేయొచ్చు. ఏదైనా ‘ఈగ‌ల్’ వ‌చ్చే అవ‌కాశాలు 50-50 మాత్ర‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close