ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఏడో తేదీన కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకుంటే మాత్రమే నవంంబర్, డిసెంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ లో రద్దు చేస్తారని కొంత మంది అవగాహన లేని ప్రచారాలు చేస్తున్నారు. అక్టోబర్ లో రద్దు చేసినా చేయకపోయినా… ఎన్నికలు జరిగేది మాత్రం మార్చిలోనే. ఎందుకంటే.. అక్టోబర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది.
ఎన్నికలు నిర్వహించాలంటే ఈసీ చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇవాళ అసెంబ్లీ రద్దు చేస్తే రేపు షెడ్యూల్ ప్రకటించడానికి ఉండదు. అసెంబ్లీ కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ఈసీ సన్నాహాలు చేస్తుంది. ముందస్తు పెట్టాలన్నా అంతే. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అధికారుల బదిలీలు చేపట్టాలని ఐదు రాష్ట్రాల ప్రభు్తవాలకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై ఆఫీసర్లకు మాస్టర్ ట్రైనింగ్ కూడా ప్రారంభించారు.
ఈసీ నుంచి వస్తున్న ఎక్స్పర్ట్స్ ఓటర్ల నమోదు దగ్గరి నుంచి నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, ప్రచారం, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ప్రతి రాష్ట్రంలో జరగాల్సిందే. ఈ ఏడాది అక్టోబర్ చివరలో లేదంటే నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉంది. జనవరి 16వరకూ అసెంబ్లీ గడువు ఉన్నప్పటికి ఐదు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించాలంటే…… నవంబర్ లోనే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉటుంది.
ఏపీలోనూ ఇలాంటి సన్నాహాలు ప్రభుత్వం పూర్తి చేయాలంటే… తక్షణం అసెంబ్లీని రద్దు చేయాలి. అనధికారికంగా ఇలాంటి సన్నాహాలను ఈసీ చేయదు. అందుకే జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారా లేదా అన్నదానిపై ఏడోతేదీన క్లారిటీ వస్తుంది.