ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా కూటమి సునామీ కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్స్ నుంచి అత్యధిక సీట్లలో అధిక్యత కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపి పది సీట్లలో ఆధిక్యం కనిపించేసరికి.. కూటమికి మ్యాజిక్ మార్క్ ఆధిక్యాలు దాటిపోయాయి. వైసీపీ అగ్రనేతల్లో పలువురు వెనుకబడి ఉన్నారు.దాదాపుగా మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నారు.
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీ పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అగ్రనేతలంతా ఓడిపోయే అవకాశలు ఉన్నాయి. బొత్స కూడా స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. ఇక రాయలసీమలోనూ వైసీపీ పూర్తిగా వెనుకబడిపోయింది. కడపలోనే నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. నందికొట్కూరు లాంటి సీట్లలోనూ టీడీపీ ఆధిక్యంలో ఉంది.
ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్… ఆధిక్యాలు రౌండ్ రౌండ్‌కు వేలల్లోనే వస్తూండటంతో.. వైసీపీ.. గతంలో టీడీపీ కన్నా తక్కువ సీట్లకు పరిమితమైన ఆశ్చర్యంలేదన్న వాదన వినిపిస్తోంది. ట్రెండ్స్ జోరుగా ఉండటంతో.. వైసీపీ కార్యాలయం నిర్మానుష్యమయింది