తెలుగు రాష్ట్రాల ప్రజలను భూప్రకంపనలు భయపెట్టాయి. రెండు రాష్ట్రాల్లోను హైదరాబాద్, విజయవాడ వంటి ప్రముఖ నగరాల్లోనూ ఈ ప్రకంపనలు వచ్చాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఊదయమే ఏడు గంటల సమయంలో వచ్చిన ఈ ప్రకంపనలను చాలా మంది ఏదో భారీ వాహనం తమ ముందు ఉన్న రోడ్డు లేదా సమీపంలో వెళ్తుందేమో అనుకున్నారు. కానీ కాసేపటికి అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితి ఉందని గుర్తించడంతో.. భూప్రకంపనలుగా తేల్చారు.
రెక్టర్ స్కేలుపై ఈ ప్రకంపనలు 5.0గా నిర్ధారితం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్థాయి భూప్రకంపనలు ఏ మాత్రం డేంజర్ కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే భూకంపాలకు ఏ మాత్రం అవసరం లేని ప్రాంతాలుగా పేరున్న తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రకంపనలు రావడాన్ని మాత్రం అంత తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
భూప్రకంపనలు వచ్చిన తర్వాత చాలా చోట్ల నుంచి సీసీ కెమెరాల దృశ్యాలు చాలా చోట్ల వైరల్ అయ్యాయి. అయితే చాలావరకూ అన్నీ పాతవి, పేక్ దృశ్యాలే. అసలైనదృశ్యాలు మాత్రం చాలా కొద్ది సేపు అంటే మూడు సెకన్లు మాత్రం కదిలాయి. గత యాభై ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ ప్రాంతంలో ప్రకంపనలు రాలేదు. దీనిపై ప్రభుత్వాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది.