ఆర్థిక అసమానతలను తగ్గించేలా.. సుపరిపాలన అందిస్తున్నామని..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సుపరిపాలనపై.. ఆయన రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పాలనలో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని …వినూత్న సాంకేతికత విధానాలను తీసుకొచ్చామని ప్రకటించారు. సహజ వనరులు, మానవ వనరుల్ని వినియోగించుకున్నామని శ్వేతపత్రంలో ప్రకటించారు. రాజధాని, పరిశ్రమలు కూడా లేకుండా… దార్శనిక పత్రాన్ని రూపొందించుకుని ముందడుగు వేశామని …విజన్ రూపొందించుకోవడమే కాదు అమలు కూడా ముఖ్యమేనన్నారు. మూడు నెలలకోసారి వృద్ధి ఫలితాలను మదింపు చేసి…. 7 మిషన్లు, 5 ప్రచార ఉద్యమాలు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
వ్యవసాయం, విద్య, సాంకేతికత, పర్యావరణం, మౌలిక సదుపాయాల్లో… రాష్ట్రానికి జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, హ్యాపీనెస్ ఇండెక్స్‌లో నెంబర్-1గా నిలిచామన్నారు. అలాగే.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో… ఆనందంగా జీవించడం అంతే ముఖ్యమని హ్యాపీనెస్ ఇండెక్ట్స్ను కొలమానంగా తీసుకుని సుపరిపాలన అందించామన్నారు. మిషన్ అంత్యోదయలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచిన…37 గ్రామాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. ఈ-ప్రగతి ద్వారా అన్ని ప్రభుత్వశాఖల్ని కంప్యూటరీకరించి.. పరిష్కార వేదిక పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామని ప్రకటించారు. పీపుల్స్ హబ్ పేరుతో ప్రజల ప్రయోజనాలు.. అందుబాటులో ఉన్న వనరులను బేరీజు వేసుకుంటున్నామన్నారు.దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో భూధార్ వ్యవస్థ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భూ క్రయవిక్రయాల్లో అవకతవకలు లేకుండా చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో తప్పు జరగకుండా అధికారులకు ఎప్పటికప్పుడు రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని… మానవ వనరుల అభివృద్ధికి సులభతర విధానాలు తెచ్చామని శ్వేతపత్రంలో ప్రకటించారు. విభజన సమస్యల్ని అధిగమించేందుకు ప్రతి ఏటా… నవ నిర్మాణ దీక్షతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. వయాడక్ట్ విధానంతో ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చుకుంటున్నాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయంలో వ్యూహాలు మార్చుకుని .. డెయిరీ, పౌల్ట్రీ, హార్టీకల్చర్ వైపు దృష్టి పెట్టామన్నారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి .. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని దేశంలో తొలిసారి చెప్పింది ఏపీనేనని చెప్పుకొచ్చారు.అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని .. ల్యాండ్, వేస్ట్, ఎనర్జీ, లాజిస్టిక్ మేనేజ్మెంట్ అవలంభిస్తున్నామన్నారు. తుఫాన్ కదలికల్ని నిర్దిష్టంగా పసిగట్టగలుగుతున్నామని గుర్తు చేశారు.ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో… జవాబుదారితనం ఉండేలా డిజిటలైజ్ చేశామని చంద్రబాబు శ్వేతపత్రంలోప్రకటించారు.