తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. కూర్చున్న చోటు నుంచి ఇంటి నిర్మాణ అనుమతి పొందే విధానాన్ని ప్రవేశ పెట్టింది. బిల్డ్ నౌ అనే విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఫోన్లోనే బిల్డ్ నౌ వెబ్‌సైట్‌ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి గరిష్ఠంగా 15 రోజుల్లో అనుమతి పొందవచ్చు. ఇది ఏఐతో పని చేసే టూల. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది.
భవన నిర్మణానికి ఆర్కిటెక్ట్‌లు రూపొందించే డ్రాయింగ్ ప్రామాణికం. ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతోంది. అది కాస్తా బిల్డ్ నౌ యాప్‌తో నిమిషాల్లో జరిగిపోతుదంి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీడీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ, తదితర శాఖలన్నీ బిల్డ్ నౌతో అనుసంధానపై పని చేస్తాయి.
దరఖాస్తు, వాటి స్థితిగతులు, ఏ అధికారి వద్ద పెండింగులో ఉంది, ఇతరత్రా వివరాలను దరఖాస్తుదారు తెలుసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సమాచారం ఉంటుంది. సామాన్యుడు సైతం తనకున్న ఇంటి స్థలంలో ఎన్ని అంతస్థులు కట్టుకోవచ్చు, సెట్ బ్యాక్ ఎంత వదలాలి, దరఖాస్తు విధానం గురించి వెబ్సైట్లోనే వివరాలు పొందవచ్చు. చాట్ బాట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. డ్రాయింగ్ ప్రకారం 3డీ ఇంటి నమూనాలను కూడా చూడవచ్చు.
బిల్డ్ నౌను రేవంత్ ప్రారంభించారు. అమలులో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి అతి పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవచ్చు.