ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పట్ల ఎన్నికల సంఘం.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో… మరో ఘటనలో వెల్లడవుతోంది. ఐదు కేంద్రాల్లో పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు సీఈవో జీకే ద్వివేదీ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఆ ఐదు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా రెండు రోజుల తర్వాత ప్రకటించారు. అయితే.. ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాత్రం.. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఐదు కేంద్రాల్లో ఎందుకు రీపోలింగ్ కు సిఫార్సు చేశారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. కానీ.. మాక్ పోలింగ్ ఓట్లు తొలగించకపోవడం.. పదే పదే ఈవీఎంలు మొరాయించడం వంటి కారణాల వల్ల.. రీపోలింగ్ కి సిఫార్సు చేసినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరులో రెండు, నెల్లూరులో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది. అయితే పది రోజులు గడిచినప్పటికీ.. ఇంత వరకూ.. కేంద్ర ఎన్నికల సంఘం. ఇంత వరకూ.. రీపోలింగ్ తేదీని ప్రకటించలేదు.
మరో వైపు…. ఎన్నికల సంఘం తీరుపై .. తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నేతలు.. ఎన్నికల నిబంధనలు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ రెండు గంటలకు ఆలస్యం అయితే.. రీపోలింగ్ నిర్వహించాలన్న నిబంధనను … చూపించి.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎంత సమయం… పోలింగ్ కు దూరం అయిందో.. అంత సమయం సేపు ఎడ్జర్న్ పోలింగ్ నిర్వహించాలనే డిమాండ్ టీడీపీ చేస్తోంది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేదీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు మాత్రం వెళ్లలేదు. ఓ ఐదు పోలింగ్ కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ కు సిఫార్సు చేశారు. రీపోలింగ్ జరుగుతుందని ప్రకటించిన తర్వాత కూడా.. ఇంతగా ఆలస్యం చేయడం ఇటీవలి కాలంలో లేదు.
మామూలుగా అయితే.. రీపోలింగ్ అవసరం అయితే.. తక్షణం నిర్ణయం తీసుకుని..రెండు రోజుల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఏపీ విషయంలో మాత్రం మొదటి నుంచి.. ఎన్నికల సంఘం.. తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో రీపోలింగ్ పై నిర్లక్ష్యంతోనే స్పష్టమయింది. ఓ పార్టీకి ప్రయోజనం కల్పించేందుకు .. బీజేపీ నేతల ప్రమేయంతో.. ఈసీ ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. ఈసీ మాత్రం పట్టించుకోవడం లేదు.