జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. ఈసీ సూచనలతో గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు రద్దు చేశారంటే.. తనకు తానే మైనింగ్ కేటాయించుకున్నారని తేలడంతో ఇలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గత సంవత్సరం తనకు రాయి మైనింగ్ లీజును కేటాయించడానికి తన పదవిని దుర్వినియోగం చేసినందుకు సోరెన్ దోషిగా తేలిందని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఈ కారణం ప్రకారం అనర్హతా వేటు వేయవచ్చు కానీ.. ఏపీ సీఎం జగన్ కూడా అంతకు మించి కేటాయింపులు చేసుకున్నారు కదా అనే డౌట్ సహజంగానే తెలుగు రాష్ట్రాల్లోని వారికి వస్తుంది. సీఎం జగన్ కు చెందిన పలు రకాల కంపెనీలకు కేటాయింపులు ఈ మూడేళ్లలో ఎన్నో సార్లు జరిగాయి. ఆయన పత్రిక సాక్షికి.. నేటికీ నెలకు రూ. ముఫ్పై కోట్ల వరకూ ప్రజాధనం ప్రకటనల రూపంలో పంపిణీ అవుతూ ఉంటుంది. పల్నాడులో ఇంత వరకూ కట్టని సరస్వతి పవర్ పరిశ్రమకు పెద్ద ఎత్తున గనుల కేటాయింపులు చేసుకున్నారు. నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున కొంటున్న సిమెంట్‌లో అత్యధికం భారతీ సిమెంట్‌దే. ఇలా చెప్పుకుంటూ పోతే..జార్ఖండ్ సీఎం సోరెన్ చేసింది చాలా తక్కువే.
అయితే హేమంత్ సోరెన్ చేసిన విషయం ఒక్క దాన్నే ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకుందో స్పష్టత లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇదే కారణం అయి ఉండవచ్చు. ఆయనపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎం పదవికే ఎసరు పెట్టేశారు. నిబంధనలు అందరికీ ఒకే రకంగా అమలు చేస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పెరుగుతోంది. ఒక్కొక్కరితో ఒక్కో రకంగా వ్యవహరిస్తే అనుమానం పెరుగుతుంది.